Paytm News: వాస్తవానికి చాలా కాలంగా దేశంలోని స్టార్టప్ కంపెనీల పరిస్థితి ఆర్థికంగా దిగజారుతోంది. ఒకప్పుడు మార్కెట్లో వెలుగువెలిగిన కంపెనీలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మరో పక్క రెగ్యులేటరీ చర్యలు వాటి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం పరిస్థితి గురించే. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల కంపెనీపై రిజర్వు బ్యాంక్ కఠిన చర్యలతో పాటుగా.. తాజా నివేదిక ప్రకారం కంపెనీ వార్షిక పనితీరు సమీక్ష తర్వాత వివిధ విభాగాల్లో తొలగింపులు ఉండవచ్చని వెల్లడైంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మనుగడ ఆర్బీఐ చర్యలతో దిగజారిన వేళ తాజా వార్త వెలుగులోకి వచ్చింది.

పేటీఎం ఎంత మందిని తొలగించనుందనే విషయాన్ని ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు. కానీ కొన్ని విభాగాలు తమ జట్టు పరిమాణాన్ని 20 శాతం తగ్గించాలని కోరాయి. నివేదిక ప్రకారం రెండు వారాల క్రితమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మదింపు సమయం కొనసాగుతోందని పేటీఎం ప్రతినిధి రిట్రెంచ్‌మెంట్ అంశంపై తెలిపారు. దీన్ని రిట్రెంచ్‌మెంట్ అనకూడదని, అది పనితీరుపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తొలగింపులు ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రతి కంపెనీ పరిస్థితులకు అనుగుణంగా ఈ పద్దతిని పాటిస్తాయి. అయితే పేటీఎం మాత్రం తొలగింపులకు సంబంధించిన వివరాలను ప్రకటించలేదు. కంపెనీలోని టీమ్స్‌ను పునర్నిర్మించాలని యాజమాన్యం నుంచి ఆర్డర్ ఉందని ఒక ఉద్యోగి అజ్ఞాత పరిస్థితుల గురించి వెల్లడించారు. తొలగింపులకు సంబంధించిన కాల్స్ హెచ్ ఆర్ నుంచి ఒక్కొక్కరికి వస్తున్నాయని అతడు వెల్లడించాడు. దీనికి తోడు పేటీఎం తన కార్యకలాపాల కోసం AI ఆధారిత ఆటోమేషన్‌ను ఉపయోగిస్తోందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.


Click it and Unblock the Notifications