Rakesh Jhunjhunwala: దివంతగ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, బిగ్‍బుల్ రాకేష్ జున్‍జున్‍వాలా పెట్టుబడుల ప్రపంచంలోని ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేని పేరు. ఆయన మరణానికి ముందు చివరిగా విమానయాన రంగంలోకి అడుగుపెట్టి ఆకాశ సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మార్కెట్లను ముందుగా అంచనా వేయటంలో ఆయనపెద్ద దిట్ట. అందుకే ఆయన పెట్టుబడుల పోర్ట్ ఫోలియోను ఇన్వెస్టర్లు నిరంతరం గమనిస్తూనే ఉండేవారు. అయితే ఆయన మరణం తర్వాత ఆయన పెట్టుబడి కంపెనీతో పాటు భార్య రేఖా జున్‍జున్‍వాలా కూడా పెట్టుబడులు కొనసాగించిన సంగతి తెలిసిందే.
రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని చాలా స్టాక్‌లు మల్టీబ్యాగర్ రిటర్న్‌లను ఇచ్చాయి. అలా 2022లో మరణానికి ముందు వరకు దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి సామ్రాజ్యాన్ని రాకేష్ సృష్టించారు. అయితే ఇటీవలి కాలంలో రేఖా జున్‍జున్‍వాలా ఫోకస్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై తగ్గిందని తెలుస్తోంది. రాకేష్ పెట్టుబడులను ఆయన మరణం తర్వాత పర్యవేక్షించిన రేఖా ప్రస్తుతం మరో భిన్నమైన మార్గాన్ని తన పెట్టుబడుల కోసం ఎంచుకున్నట్లు ఇటీవలి పరిణామాలతో అర్థం అవుతోంది. అయితే ఆమె సడన్ షిఫ్ట్ మార్కెట్లలో పరిస్థితుల వల్ల వచ్చిందా లేక ఆమెకున్న మక్కువతో వచ్చింతో తెలియదు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం రేఖా జున్‌జున్‌వాలా తన పెట్టుబడి సరళి, వైఖరిని కొత్త మార్గాల్లోకి మళ్లించినట్లు తెలుస్తోంది. లేడీ జున్‌జున్‌వాలా రియల్ ఎస్టేట్‌లోకి అడుగుపెట్టినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించారు. తాను రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో పెట్టుబడి ప్రాముఖ్యతను గుర్తించానని ఈ నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడిస్తూ తెలిపారు. తన భర్త రాకేష్ జీవించిఉన్నప్పుడు ఇంట్లో పెట్టుబడుల గురించి చర్చించినప్పుడు తాను పట్టించుకోలేదని రేఖా ఈ సందర్భంగా బయటపెట్టారు. అప్పట్లో ఈ వ్యవహారాలపై కొంత ఆసక్తిని చూపి ఉండాల్సిందని బాధపడ్డారు. ప్రస్తుతం తాను తన భర్త పోర్ట్ ఫోలియోను మాత్రమే నిర్వహించగలనని ఈ క్రమంలో వెల్లడించారు.
అలాగే రాకేష్ జున్‌జున్‌వాలా తన ఆరోగ్యంపై ఇంకొద్దిగా శ్రద్ధ వహించి ఉండాల్సిందని రేఖా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పెట్టుబడులు ఎక్కువగా ఈక్విటీలో ఉన్నాయని, ఇందులో లిస్టెడ్ కంపెనీలతో పాటు కొన్ని అన్ లిస్టెడ్ కంపెనీల్లోనూ హోల్డింగ్స్ ఉన్నట్లు ఆమె వెల్లడించారు. రాకేష్ పొందిన సంపదలో ఎక్కువ భాగం క్రిసిల్, టాటాలకు చెందిన టైటాన్ వంటి కంపెనీల నుంచే వచ్చినట్లు వెల్లడైంది. ఇక పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.. మెుదట తన కజిన్ సిస్టర్ కోసం రాకేష్ పెళ్లి ప్రపోజల్ వచ్చిందని, అయితే ముందు రేఖాను ఆయనను కలవాల్సిందిగా ప్రపోజల్ తెచ్చిన వ్యక్తి సూచించటంతో చివరికి పెళ్లి జరిగిందన్నారు. అయితే విలాసవంతమైన జీవితం నుంచి వచ్చిన రేఖా పెళ్లైన కొత్తలో కొంత ఇబ్బంది పడినప్పటికీ, స్టాక్ మార్కెట్లో రాకేష్ విజయం సాధించాక విలాసాలను రుచిచూశారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

బెంగళూరు సబర్బన్ రైలు ఆగిందా? ఐటీ ఉద్యోగులకు షాకింగ్ వార్త

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications