పోప్ ఫ్రాన్సిస్ ఈ లోకంలో ఇక లేరు. సోమవారం అంటే ఇవాళ ఉదయం 7:35 గంటలకు ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. వాటికన్ సిటీ ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. కాథలిక్ చర్చి అధిపతిగా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ చాలా నెలలుగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ రోమన్ కాథలిక్ చర్చికి మొదటి లాటిన్ అమెరికన్ లిడర్. అతని 12 సంవత్సరాల పాలన ఎన్నో ఉద్రిక్తతలతో గుర్తుండి పోతుంది. ఎందుకంటే అతను తరచుగా సంప్రదాయవాద సంస్థను సంస్కరించడానికి ప్రయత్నించాడు. అంతేకాక కొన్ని కార్లతో సహా భారీ ఆస్తిని వదులుకున్నాడు.

పోప్ ఫ్రాన్సిస్ 2013లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఆయన చర్చి నుండి ఎటువంటి జీతం తీసుకోవడానికి నిరాకరించారు. కానీ ఇంతకు ముందు ఉన్న పోప్ జీతం పొందేవారు. ప్రస్తుతానికి అతని జీతం నెలకు దాదాపు $32,000 అంటే సుమారు రూ. 27.32 లక్షలు. కానీ, పోప్ ఫ్రాన్సిస్ ఈ డబ్బును చర్చిలకి విరాళంగా ఇవ్వడం లేదా ఏదైనా ఫౌండేషన్ లేదా ట్రస్ట్ లేదా పేద కుటుంబానికి ఇచ్చేవారు. అంటే పోప్ ఫ్రాన్సిస్ ఇప్పటివరకు ఎలాంటి జీతం తీసుకోలేదు.
మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే : జీతం తీసుకోనప్పటికీ, పోప్ ఫ్రాన్సిస్ సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. పోప్‌గా అతని ఆస్తుల విషయాలు చూస్తే అతని నికర విలువ దాదాపు $16 మిలియన్లు అంటే సుమారు రూ. 137 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో అతని ఉపయోగం కోసం ఐదు కార్లు కూడా ఉన్నాయి. జీతం తీసుకోనప్పటికీ, ఈ మొత్తం కూడా అతని సంపదకు చెందుతుంది.
పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటీనాలో జన్మించారు. అతని పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో పోప్ బెనెడిక్ట్ XVI రాజీనామా చేసిన తరువాత, ఆయన మొదటి లాటిన్ అమెరికన్ పోప్ అయ్యాడు. తన పదవీకాలంలో అతను ఎల్లప్పుడూ సింపుల్ జీవితాన్ని గడపడానికి ప్రసిద్ది చెందాడు. 2001లో పోప్ అయ్యే ముందు కూడా ఆయన ఎప్పుడూ చర్చి నుండి డబ్బు తీసుకోలేదని వాటికన్ సిటీ చెబుతుంది.
కాథలిక్ చర్చి ఎంత గొప్పది: పోప్ ఫ్రాన్సిస్ సింపుల్ లైఫ్ గడువుతున్నప్పటికీ, కానీ కాథలిక్ చర్చి చాలా సంపన్నమైనది. ఈ చర్చికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఆస్తులు ఉన్నాయి. ఇది చర్చి ఆర్థిక బలాన్ని పెంచుతుంది కూడా.


Click it and Unblock the Notifications