NDTV: అదానీ కన్నేస్తే అది అతని వశం కావల్సిందే. అవును ఎన్డీటీవీ విషయంలోనూ ఇదే రుజువైనట్లు కనిపిస్తోంది. NDTVని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ మార్గంలో షేర్లను కొనుగోలుచేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి మంచి స్పందన కూడా వచ్చింది.

దూసుకెళ్తున్న స్టాక్..
అదానీ స్పీడ్ పెంచటంతో ఎన్డీటీవీ డైరెక్టర్లు ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ రాజీనామా చేశారు. గతంలో ఈ వివాదం కోర్టు దాకా వెళ్లింది. బోర్డు డైరెక్టర్లు రాజీనామాలు చేసిన వార్తల నేపథ్యంలో స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. ప్రస్తుతం షేర్ ధర రూ.446.30ను తాకింది.

కొత్త డైరెక్టర్లు..
ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేసిన విషయాన్ని ఎన్డీటీవీ లిమిటెడ్ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలిపింది. దీంతో ఇద్దరి రాజీనామాలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఈ క్రమంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగ్లియా, సంథిల్ సమియా చంగళవరాయన్‌లు ఎన్డీటీవీకి కొత్త డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్‌ఆర్‌పిఆర్ హోల్డింగ్ వెల్లడించింది.

షేర్ ధర హిస్టరీ..
గత 5 రోజుల్లో NDTV షేర్లు 22 శాతానికి పైగా జంప్ చేశాయి. ఓపెన్ ఆఫర్ కారణంగా స్టాక్ నిరంతరం దూసుకుపోతోంది. గత నెలలో షేర్లు ఏకంగా 38 శాతం రాబడిని అందించాయి. అలాగే ఆరు నెలల కాలంలో స్టాక్ 161 శాతం పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు స్టాక్ 288 శాతానికి పైగా తన ఇన్వెస్టర్లకు అందించింది.

అదానీకి వాటాలు..
షేర్ల బదిలీతో రాజీనామా చేసిన ఇద్దరు డైరెక్టర్లకు ఎన్డీటీవీలో ఉన్న 29.18 శాతం వాటాలు అదానీ పరమవనున్నాయి. దీనికి తోడు మెజారిటీ స్టేక్ హోల్డర్ గా అదానీ అవతరించటానికి అవసరమైన 26 శాతం వాటాలను గ్రూప్ ఓపెన్ ఆఫర్ రూపంలో కొనుగోలు చేస్తోంది. అయితే ఈ హాస్టైల్ టేకోవర్ విషయం వ్యాపార వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. మీడియా రంగంలో మంచి గుర్తింపు కలిగిన ఎన్డీటీవీని ఇలా అదానీ వశం చేసుకోవటం గమనార్హం.


Click it and Unblock the Notifications