ప్రముఖ గ్లోబల్ CRM సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన సేల్స్‌ఫోర్స్ భారీ తొలగింపు ప్లాన్స్ ప్రకటించింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇంకా గూగుల్ ఈ ఏడాది 2025లో ఉద్యోగుల తొలగింపులను ప్రకటించగా, సేల్స్‌ఫోర్స్ ఇప్పుడు ఉదోగులను తొలగించిన కంపెనీల లిస్టులో చేరడంతో టెక్కీలను నిరాశకు గురిచేసింది.సేల్స్‌ఫోర్స్ కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా కొత్త ప్రొడక్ట్స్ అభివృద్ధి చేయడానికి అలాగే సేల్స్ పెంచడంపై దృష్టి పెట్టేందుకు చురుకుగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా ఈ కొత్త ట్రాన్స్ఫర్మేషన్ కోసం అవసరమైన సిబ్బందిని నియమిస్తోంది. ఇదే సమయంలో తొలగింపులను కూడా చేపడుతోంది.
బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన నివేదికల ప్రకారం, సేల్స్‌ఫోర్స్ పునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తోంది. గత ఏడాది జనవరి 2024లో దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, జూలైలో మరో 300 మంది ఉద్యోగులను తొలగించింది. దీని తరువాత ఈ తొలగింపులు 2025లోకి కూడా పాకింది.

ఈ తొలగింపుల మధ్య సేల్స్‌ఫోర్స్ కృత్రిమ మేధస్సు సాంకేతికతలో పెట్టుబడులు కూడా పెట్టడం కొనసాగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేల్స్ రిప్రజెంటేటివ్‌లను (వర్చువల్ రిప్రజెంటేటివ్‌లు) సృష్టించే "ఏజెంట్‌ఫోర్స్" ప్లాట్‌ఫామ్ ద్వారా డిసెంబర్ నుండి కంపెనీ 1,000కి పైగా డీల్‌లను ముగించిందని CEO మార్క్ బెనియోఫ్ ప్రకటించారు. AI టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడంలో ఇంకా భవిష్యత్ వ్యాపారం అండ్ ఆదాయ వృద్ధిని నడిపించడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ విశ్వసిస్తుంది.
కంపెనీ త్రైమాసిక ఆదాయ నివేదిక ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ నివేదిక కంపెనీ ఆర్థిక పనితీరు, పెరుగుతున్న కృత్రిమ మేధస్సు ఆధారిత మార్కెట్‌లో దాని ప్రాధాన్యతలపై అదనపు సమాచారాన్ని అందిస్తుంది. ప్రస్తుతం తొలగించనున్నా ఉద్యోగులకు కంపెనీలోని ఇతర విభాగాలలో పనిచేసే అవకాశం కల్పిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.

మెటా కూడా ఉద్యోగుల తగ్గింపు
సేల్స్‌ఫోర్స్ మాత్రమే వర్క్‌ఫోర్స్ తొలగింపులు చేయడం లేదు. జనవరి 2025లో మెటా పర్ఫార్మెన్స్ రివ్యూ ప్రక్రియలో భాగంగా కంపెనీ ఉద్యోగులలో దాదాపు 5% మందిని తగ్గించాలని ప్రకటించింది. CEO మార్క్ జుకర్‌బర్గ్, ఉద్యోగులకు రాసిన మెమోలో కంపెనీ ఇప్పుడు తక్కువ పనితీరు కనబరిచే ఉద్యోగులను మరింత త్వరగా తొలగిస్తుందని పేర్కొన్నారు. తొలగింపులు ప్రస్తుత పర్ఫార్మెన్స్ సైకిల్ ముగిసే సమయానికి మెటా 10% మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఈ ఉద్యోగాల కోతలు ఉన్నప్పటికీ సేల్స్‌ఫోర్స్, మెటా రెండూ కీలకమైన రంగాలలో నియామకాలను కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications