Kuwait Fire: కువైట్ అగ్నిప్రమాదం.. భారతీయ వలస కార్మికులకు ఇన్సూరెన్స్ స్కీమ్..

Pravasi Bharatiya Bima Yojana: అధిక జనాభా కలిగిన భారతదేశం నుంచి చాలా మంది కువైట్ వంచి అరబ్ దేశాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం వసల వెళుతుంటారు. అయితే వీరి ఆర్థిక సంరక్షణకు ఉన్న ప్రభుత్వ ఇన్సూరెన్స్ ప్రస్తుతం కువైట్ అగ్నిప్రమాదం తర్వాత మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.

కువైట్‌లోని ఆరు అంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు 40 మంది భారతీయ వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. ఈ దుర్ఘటన ఇన్సూరెన్స్ పాలసీ ప్రాముఖ్యతను సూచిస్తోంది. ఈ క్రమంలో భారతీయ వలస కార్మికులు మరణించినా లేక శాశ్వత అంగవైకల్యం కలిగినా వారికి రూ.10 లక్షల వరకు అందించే ఇన్సూరెన్స్ స్కీమ్ ఇప్పుడు అందుబాటులో ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. తాజా ప్రమాదం తర్వాత ఇది చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

After Kuwait Fire Accident Everyone eye on Pravasi Bharatiya Bima Yojana Insurance Scheme

ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం కింద విదేశాలలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం ఏర్పడిన సందర్భంలో యజమాని /స్థానం మారినప్పటికీ, బీమా చేయబడిన వ్యక్తికి రూ.10 లక్షల మొత్తం అందించబడుతుంది. రెండేళ్ల కాలానికి రూ.275, మూడేళ్ల కాలానికి రూ.375 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికింద ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చికిత్స కోసం రూ.50 వేలు, గాయాలు/అనారోగ్యం సహా వైద్య బీమా కవరేజ్ రూ.1,00,000/- వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే స్కీమ్ కింద వైద్యపరంగా అన్‌ఫిట్/ఉద్యోగాన్ని అకాల తొలగింపు కోసం స్వదేశానికి పంపే కవర్: భారతదేశంలోని సమీప అంతర్జాతీయ విమానాశ్రయానికి వాస్తవ వన్-వే ఎకానమీ క్లాస్ విమాన ఛార్జీలు అందించబడతాయి.

ప్రసూతి ఖర్చుల ప్రయోజనం మహిళల వలసదారులకు రూ.50,000/- వరకు అందుబాటులో ఉంటుంది. 45,000/- వరకు అనుమతించదగిన వలసదారుల విదేశీ ఉద్యోగానికి సంబంధించిన వ్యాజ్యంపై చట్టపరమైన ఖర్చులు. ప్రస్తుతం మరణించిన లేదా గాయపడిన వారి కుటుంబాలకు, కువైట్ అగ్నిప్రమాద బాధితులు ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకాన్ని ఎంచుకున్నట్లయితే పైన పేర్కొన్న ప్రయోజనాలను పొందవచ్చు. క్లెయిమ్ పొందటానికి ప్రమాదవశాత్తు మరణాన్ని నిర్ధారించే పోలీసు నివేదిక; పోస్ట్ మార్టం నివేదిక; సంబంధిత ఇండియన్ ఎంబసీ నుండి ఒక సర్టిఫికేట్ / నివేదిక; చివరిగా పాస్‌పోర్ట్ కాపీ అవసరం. ఎవరైనా ఉద్యోగం కోసం ఇతరదేశాలకు వెళుతున్న ప్రవాస భారతీయులు ప్రవాసీ భారతీయ బీమా యోజన స్కీమ్ కింద పాలసీని IFFCO-TOKIO జనరల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ వంటి సంస్థల నుంచి ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+