వాషింగ్టన్: ఇ-కామర్స్ జెయింట్ అమెజాన్ కీలక అధికారి డేవ్ క్లార్క్ తన పదవికి రాజీనామా చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఆయన అమెజాన్‌లో పని చేశారు. ఇప్పుడాయన ఈ ప్లాట్‌ఫామ్ నుంచి తప్పుకొన్నారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అదే లేఖను సంస్థ అధినేత జెఫ్ బెజోస్ సహా ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులకు మెయిల్ చేశారు. జులై 1వ తేదీన తాను సంస్థను వీడనున్నట్లు డేవ్ క్లార్క్ తెలిపారు.
23 సంవత్సరాల పాటు డేవ్ క్లార్క్ అమెజాన్‌తో అసోసియేట్ అయి ఉన్నారు. 1999లో అమెజాన్‌లో జాయిన్ అయ్యారు. అంచెలంచెలుగా ఎదిగారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో పని చేస్తోన్నారు. ప్రస్తుతం అమెజాన్ వరల్డ్‌వైడ్ కన్జ్యూమర్ బిజినెస్ విభాగానికి డేవ్ క్లార్క్ అధిపతి. గత సంవత్సరం జనవరిలో ఈ విభాగానికి సీఈఓగా అపాయింట్ అయ్యారు. ఈ ఏడాదిన్నర కాలంలో అమెజాన్ కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడంలో కీలకపాత్ర పోషించారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వెంటనే తాను అమెజాన్‌లో జాయిన్ అయ్యానని, అప్పటికి ఈ కంపెనీ ఓ సాధారణ స్టార్టప్‌గా ఉండేదని డేవ్ క్లార్క్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆరు ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లు మాత్రమే ఉండేవని చెప్పుకొచ్చారు. ఆ తరువాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకోగలిగామని, సంస్థ నెట్‌వర్క్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడానికి శ్రమించామని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు తాను వైదొలగాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. అమెజాన్‌తో కలిసి సాగిన ప్రయాణం ఓ అద్భుతమని కితాబిచ్చారు. డేవ్ క్లార్క్ తన భవిష్యత్ ప్రణాళికేమిటనేది ఇంకా వెల్లడించట్లేదు గానీ.. సొంతంగా ఓ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్దేశంతోనే ఆయన అమెజాన్ నుంచి బయటికి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. డేవ్ క్లార్క్ స్థానంలో అమెజాన్ మేనేజ్‌మెంట్ ఎవరిని అపాయింట్ చేస్తుందనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications