Stock Market: స్టాక్ మార్కెట్ ఉప్పెనలా ఎగసి నష్టాల్లో క్లోజ్, సాయంత్రానికి ఏమైంది..?
Market Closing: ఉదయం టోక్యో మార్కెట్లు తిరిగి పుంజుకోవటంతో దానికి అనుగుణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీ పెరుగుదలను చూశాయి. అయితే చివరికి లాభాలు ఆవిరై కీలక బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. వాస్తవానికి ఓలటాలిటీ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టింది.
మార్కెట్ క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 166 పాయింట్లు కోల్పోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 63 పాయింట్ల నష్టంలో ముగిసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 344 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 342 పాయింట్ల పతనాన్ని చూసింది. అలాగే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టపోయాయి. మంగళవారం నాడు డాలర్‌కు 83.95 వద్ద సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. సెక్టార్ల వారీగా పనితీరును గమనిస్తే నేడు ఆటో, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5 శాతం చొప్పున క్షీణించగా.. ఐటీ, మెటల్, రియాల్టీ రంగాల్లోని కంపెనీల షేర్లు 0.3-0.8 శాతం చొప్పున పెరిగాయి.

NSEలో బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్ టి, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, ఎల్ టిఐఎమ్, విప్రో, టాటా స్టీల్, రిలయన్స్, ఎన్టీపీసీ, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా చివరికి నిలిచాయి.


Click it and Unblock the Notifications