Stock Market: పావెల్ నిర్ణయంతో నిలకడగా మార్కెట్లు.. సెన్సెక్స్-నిఫ్టీ గెయిన్..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ గెయిన్ అయ్యాయి. అయితే నేడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ షేర్లు కొంత ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 47 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం స్వల్పంగా 35 పాయింట్లు లాభపగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 84 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లలో మార్పులు లేకుండా స్థిరంగా ఉంచటం, కనీసం రేట్ల పెంపు ఊహాగానాలకు తెరపడేలా చేయటం ఇన్వెస్టర్లకు కొంత ఊరటను కలిగించిందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, సిప్లా, నెస్లే, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, జేఎస్టబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో కోటక్ బ్యాంక్, హిందాల్కొ, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, విప్రో, దివీస్ ల్యాబ్, టైటాన్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications