Rithuparna: పరీక్షల్లో ఫెయిలైనా వెనకడుగు వేయలేదు.. సంవత్సరానికి రూ.72.3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం..
ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో ఫెయిల్ అయిన ఓ యువతి ఇప్పుడు సంవత్సరానికి రూ.72 లక్షల జీతం తీసుకునే స్థాయికి ఎదిగింది. ఆమె నీట్ పరీక్ష రాసి క్వాలిఫై కాకపోవడంతో ఆమె తన దృష్టిని రోబోటిక్స్, ఆటోమేషన్ వైపు మళ్లించింది. ఇందులో మంచి ప్రతిభ కనబరిచింది. చివరికి ప్రపంచ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ అయిన రోల్స్-రాయ్స్ లో సంవత్సరానికి రూ.72.3 లక్షల జీతంతో ఉద్యోగం సాధించి శభాష్ అనిపించుకుంది. ఆమె రితుపర్ణ. కేవలం 20 ఏళ్ల వయసులోనే రోల్స్-రాయ్స్‌లో రోబోటిక్స్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా రూ. 72.3 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం పొంది అందరికీ ఆదర్శంగా నిలిచారు.
రితుపర్ణ కర్ణాటకలో జన్మించారు. ఆమెకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉండేది. ఆ దిశగానే తన చదువును మొదలు పెట్టింది. ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ ప్రవేశం కోసం నీట్ ఎగ్జామ్ రాసింది. అయితే ఆమెకు నీట్ లో ర్యాంకు రాలేదు. ఆమె తనకు ర్యాంక్ రాలేదని అసలు బాధపడలేదు. తర్వాత ఏం చేయాలని ఆలోచించారు. లాంగ్ టర్మ్ తీసుకుని నీట్ రాస్తే ఎలా ఉంటుందని భావించారు. కానీ సమయం వృథా అవుతుందని.. పైగా డబ్బు కూడా ఎక్కువ కావాలని ఆలోచించారు. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్స్ ఏదో గుర్తించారు. దాని ప్రకారం సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & మేనేజ్‌మెంట్‌లో మెకాట్రానిక్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ ఇంజనీరింగ్ లో చేరారు.

ఈ క్రమంలోనే ఆమె పలు ఆవిష్కరణలు చేశారు. రితుపర్ణ తన ప్రాజెక్టులో భాగంగా పోకచెట్ల రైతులకు సహాయపడటానికి రోబోట్‌ను తయారు చేశారు. ఇది అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీలో పతకాలు కూడా సాధించింది. రితుపర్ణ తన చదువులో భాగంగానే రోల్స్-రాయ్స్‌లో ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం దక్కించుకుంది. రోల్స్- రాయల్స్ రితుపర్ణ ఎనిమిది నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసింది. అక్కడ పనిచేసే ఉద్యోగుల నుంచి ఎంతో నేర్చుకుంది. రాత్రిపూట షిఫ్టులతో కూడా పని చేసింది. ఆ ప్రతిభను గుర్తించిన కంపెనీ సంవత్సరానికి రూ.39.6 లక్షల జీతంతో ఉద్యోగ అవకాశం ఇచిచింది.
తర్వాత దాన్ని రూ.72.3 లక్షలకు పెంచింది. రితుపర్ణ 2024 డిసెంబర్ నుంచి రోల్స్- రాయ్స్ లో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్, గెజెబో, పైథాన్, సీ++ ఉపయోగించి రోబోటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆమె పనిలో కంట్రోల్ అల్గారిథమ్‌లు, సెన్సార్ ఇంటిగ్రేషన్, అటానమస్ రోబోటిక్ సిస్టమ్స్ ఉన్నాయి. రితుపర్ణ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని గొప్ప స్థాయికి ఎదిగారు. తన ప్రయాణాన్ని ఎక్కడా ఆపలేదు. ముందుకెళ్లి విజయం సాధించింది. 20 ఏళ్ల రితుపర్ణ జీవితం నేటి యువతకు ఆదర్శం.


Click it and Unblock the Notifications