Stock Markets: నేడు ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తర్వాత కొన్ని గంటల్లో అనూహ్యంగా తిరిగి పుంజుకున్నాయి. అయితే దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు. ప్రస్తుతం ఆయన పేరు నేషనల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వాస్తవానికి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ గెలుచుకోవటంలో చతికిలపడటంతో మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఏపీలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఆయనకు గ్యాలం వేసేందుకు తమ ప్రయత్నాలు తాము తెరవెనుక చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఫలితాల్లో బిజెపి మ్యాజిక్ ఫిగర్‌ను పొందడంలో విఫలమైన తర్వాత టిడిపి నాయకుడు తన ఎత్తుగడకు సంబంధించిన పుకార్లను క్లియర్ చేయటంతో బుల్స్ తిరిగి రంగంలోకి దిగారు. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాలను నుంటి ఒక్కసారిగా తేరుకోవటంతో ట్రెండ్ రివర్స్ అయ్యింది. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రకటన తర్వాత భారత స్టాక్ మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచిందని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ వెల్లడించారు. మూడవ సారి, బిజెపి దాదాపు 20 బేసి స్థానాల్లో విఫలమైంది. ఇది ఫలితాల అనంతర దృష్టాంతంలో టీడీపీ, ఇతర కూటమి భాగస్వాముల పాత్ర గురించి పుకార్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు డీలా పడిన సంగతి తెలిసిందే.
బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇలాంటి పుకార్లు రావడంతో పెట్టుబడిదారుల మదిలో సందేహం నెలకొందని, టీడీపీ నేతల ప్రకటనతో ఆ సందేహం తొలగిపోయింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు తాను ఎన్‌డిఎతోనే కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మెరుగైన ఆంధ్రా కోసం తీర్పునిచ్చారని, ఓటర్ల అంచనాలకు తగ్గట్టుగా టీడీపీ, బీజేపీలు కలిసి పనిచేస్తాయన్నారు. దీంతో ఇంట్రాడేలో నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రాడేలో 2 శాతం మేర పెరిగి గరిష్ట స్థాయి 22,445ని తాకింది. అలాగే సెన్సెక్స్ సూచీ సైతం 73,851 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.
మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1600 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 518 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1369 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1775 పాయింట్లు గెయిన్ అయ్యి నిన్నటి భారీ నష్టాల నుంచి ఇన్వెస్టర్లకు ఊరటను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లలో బాబు మాటే శాశనం అన్నట్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మోదీ హవా మసకరబారటంతో పాటు కేంద్రంలో తెలుగు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే క్రమంలో హెరిటేడ్ కంపెనీ షేర్లు సైతం భారీ ర్యాలీని కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications