Privatization: కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. మెున్న ఎయిరిండియా కంపెనీని ప్రైవేటీకరించిన తర్వాత ఇప్పుడు పాత అనుబంధ సంస్థలను కూడా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలయన్స్ ఎయిర్ ఏవియేషన్, ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ విక్రయానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలయన్స్ ఎయిర్ కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ క్లీన్-అప్ కసరత్తును ప్రారంభించింది. దీంతో పాటు.. మరో రెండు అనుబంధ సంస్థల విక్రయంపై కూడా కేంద్రం కసరత్తు చేస్తోంది. రానున్న నెలల్లో వీటికి బిడ్లను ఆవ్వానించవచ్చని తెలుస్తోంది.

భారీగా సొమ్ము..
ఈ కంపెనీల విక్రయం వల్ల ప్రభుత్వానికి కొత్తగా వనరులు సమకూరనున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ ఇండియాలో గతంలో పెట్టిన పెట్టుబడులు రికవరీ అవుతాయని తెలుస్తోంది. ఈ మూడు కంపెనీల్లో AI ఇంజనీరింగ్ సేవల కోసం కొనుగోలుదారుల నుంచి ఎక్కువ ట్రెండ్ కనిపించే అవకాశం ఉంది. అయితే వేగంగా విమానయానంలో ముందుకెళ్తున్న టాటా గ్రూప్ వీటిని కొనటానికి ఆసక్తి చూపవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ ఇంజనీరింగ్ అనుబంధ సంస్థలను కలిగి ఉన్న కొన్ని ప్రధాన విమానయాన సంస్థలు టాటా గ్రూప్‌తో సంయుక్తంగా మెయింటెనెన్స్ షాపులను నిర్వహించాలని చూస్తున్నాయి.

అలయన్స్ ఎయిర్..
అలయన్స్ ఎయిర్ ప్రస్తుతం 19 టర్బోప్రాప్‌ల విమానాలను కలిగి ఉంది. వీటిలో 18 ATRలు, హెచ్‌ఏఎల్ నుంచి మేడ్-ఇన్-ఇండియా డోర్నియర్ ఉన్నాయి. ఇది ప్రధానంగా ఉత్తర, ఈశాన్య భారతదేశంలోని 50 దేశీయ గమ్యస్థానాలకు 115 రోజువారీ డిస్పాచ్‌లను నిర్వహిస్తోంది. 800 మంది ఉద్యోగులతో కూడిన ఎయిర్‌లైన్ సెప్టెంబరు నాటికి మరో రెండు ATRలను HAL చేత తయారు చేయబడిన మరొక డోర్నియర్‌ను డెలివరీ తీసుకుంటోంది. ఈ ప్రాంతీయ విమానయాన సంస్థ చెన్నై నుంచి జాఫ్నాకు అంతర్జాతీయ మార్గాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది.

ఆ రెండు కంపెనీలకే అవకాశం..
దేశంలో టర్బోప్రాప్‌లను ఉపయోగించే ప్రాంతీయ విమానాల్లో ఆర్థికంగా స్థిరమైన ఆపరేటర్ ఇండిగో మాత్రమే. ఇండిగో, ఎయిర్ ఇండియా మినహా, అలయన్స్ ఎయిర్ కోసం విజయవంతంగా వేలం వేయడానికి అవసరమైన ఆర్థిక బలం మరే ఇతర భారతీయ ఆపరేటర్‌కు లేదు. ఈ విషయాన్ని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

ఎయిర్ ఇండియా హెచ్చరిక..
ఎయిర్‌పోర్టుల్లో సేవలను అందించే గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆర్మ్ అయిన AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ (AIASL) ప్రస్తుతం కొన్ని సమస్యలను ఎదుర్కొంటోందని ఎయిర్ ఇండియా ఇటీవల AIASLని హెచ్చరించింది . విమాన ఆలస్యంపై ఎయిర్ ఇండియా ఇటీవల AIASLని హెచ్చరించింది. కొన్ని విమానాశ్రయాల్లో ఇతర సర్వీస్ ప్రొవైడర్లను ఎంచుకోనున్నట్లు ఎయిర్ ఇండియా హెచ్చరించింది. AIASL ఇప్పటికే భారతీయ విమానాశ్రయాల్లో పనిచేస్తున్న గ్రౌండ్ హ్యాండ్లర్ల నుంచి కొనుగోలు ఆసక్తిని పొందవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications