Recession In India: ప్రపంచ వ్యాప్తంగా అదుపులోకి రాని ద్రవ్యోల్బణం కారణంగా దేశాలకు ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యాంకులు చేపడుతున్న చర్యలు పూర్తి స్థాయిలో అనుకున్న ఫలితాలను ఇవ్వటం లేదు. ఇప్పటికే ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఆర్థిక మాంద్యం సుడిగుండంలో చిక్కుకున్నాయి. కొన్ని చిన్న దేశాలు సైతం ఇరుకున్నాయి.

భారత్ పరిస్థితి..?
ప్రస్తుతం పరిస్థితులను చూస్తుండే ఇండియా సైతం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి సంబంధించిన సంకేతాలు మనకు అదే విషయాన్ని చెబుతున్నాయి. మే 2015 తర్వాత మెుదటి సారిగా భారత బాండ్ ఈల్డ్ కర్వ్ ఇన్వర్ట్ కావటం ఇదే విషయాన్ని సూచిస్తోంది. 364-రోజుల ట్రెజరీ బిల్లు కటాఫ్ ఈల్డ్ క్లుప్తంగా బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ కంటే ఎక్కువ పెరగటం ఇప్పుడు ఆర్థిక వేత్తలను ఆందోళనలోకి నెడుతోంది. ఇది ఆర్థిక మాంద్యం రావటానికి ముందు కనిపించే ఒక కీలక సంకేతం.

చివరిగా 2015లో..
మే 2015లో ఏడాది కాల పరిమితి బాండ్ 10 సంవత్సరాల బాండ్ కంటే ఎక్కువగా ట్రేడ్ అయ్యింది. తాజాగా RBI బుధవారం నాడు 364-రోజుల నోట్లను 7.48 శాతం వడ్డీ రేటుకు విక్రయించింది. అయితే 10 సంవత్సరాల బెంచ్‌మార్క్ బాండ్ రాబడి 7.26 శాతంగా ఉంది. 2032 బాండ్ ఈల్డ్ గరిష్ఠంగా 7.4728 శాతాన్ని తాకి 7.4547 శాతం రేటు వద్ద ముగిసింది. అక్టోబర్ 2018 నుంచి ఇతి అత్యధిక రేటు కావటం మార్కెట్లలో ఆందోళనలకు కారణంగా మారింది. ఈ రోజు స్టాక్ మార్కెట్లు కుప్పకూలగానికి ఒక విధంగా ఇది కూడా కారణమనే చెప్పుకోవచ్చు.
బాండ్ ఈల్డ్ కర్వ్ ఇన్వర్షన్ అంటే ఏమిటి?
తక్కువ కాలం బాండ్లపై వడ్డీ రాబడి దీర్ఘకాలికి బాండ్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని బాండ్ ఈల్డ్ కర్వ్ ఇన్వర్షన్ అని అంచారు. ఉదాహరణకు 365 రోజుల కాలానికి సంబంధించిన బాండ్ రాబడి 10 ఏళ్ల కాలానికి విడుదలైన బాండ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దీనిని ఈల్డ్ కర్వ్ ఇన్వెర్షన్ అని పిలుస్తారు. ప్రస్తుతం దేశాలోని ఏడాది కాలానికి సంబంధించిన ప్రభుత్వ బాండ్స్ ఎక్కువ దిగుబడిని సాధించటంతో భయాందోళనలు మెుదలయ్యాయి.

బ్రోకరేజీలు ఏమంటున్నాయంటే..?
ప్రస్తుత హెచ్చరికలను చూస్తుంటే భారతదేశం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందా అని చాలా మంది సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ట్రెజరీ బిల్లుల అమ్మకాలపై ఊహించిన దానికంటే ఎక్కువ కట్ ఆఫ్‌ల కారణంగా భారతదేశంలో ఇన్వర్షన్ జరిగింది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు కారణంగా ప్రేరేపించబడిందని తెలుస్తోంది. లిక్విడిటీలో ఈ క్షీణత కారణంగా ఈల్డ్ కర్వ్ ఇన్వర్షన్ ధోరణి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ వెల్లడించారు. అయితే దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications