భారతదేశం నుండి రొయ్యల దిగుమతులను బ్యాన్ చేసిన ఎనిమిది సంవత్సరాల అనంతరం, ఆస్ట్రేలియా మంగళవారం ఆంధ్రప్రదేశ్ నుంచి తొక్క తీయని భారతీయ రొయ్యల దిగుమతికి షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. ఈ నిర్ణయం భారతీయ సముద్ర ఆహార ఎగుమతి రంగానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ పరిశ్రమకు పెద్ద ఊపునివ్వనుంది. 2017 జనవరిలో కొన్ని భారత రొయ్యల సరుకుల్లో తెల్ల మచ్చ వైరస్ (White Spot Virus) గుర్తించడంతో.. ఆస్ట్రేలియా భారతదేశం నుండి తొక్క తీయని shrimp దిగుమతులను పూర్తిగా నిషేధించింది. ఈ నిషేధం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల ఎగుమతిదారులు పెద్ద ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సందర్భంలో ఈ సానుకూల పరిణామాన్ని ప్రకటించారు. ఆయన X (ట్విట్టర్) లో పోస్ట్ చేస్తూ, "తెల్ల మచ్చ వైరస్ గుర్తింపుతో పొట్టు తీయని రొయ్యలపై ఆస్ట్రేలియా విధించిన నిషేధం భారతీయ సముద్ర ఆహార ఎగుమతిదారులకు పెద్ద అడ్డంకిగా మారింది. నేడు ఆ నిషేధం ఎత్తివేయబడిందని ఇది భారత ఆక్వాకల్చర్ రంగానికి ఒక ప్రధాన ముందడుగని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా ఈసారి మంజూరు చేసిన అనుమతి షరతులతో కూడినది. ఉత్పత్తి అయ్యే రొయ్యలు వ్యాధి రహిత మండలాల్లో సేంద్రీయంగా పండించబడాలి, అలాగే ఎగుమతి రవాణాలో తెల్ల మచ్చ వైరస్ లేకపోవడం నిర్ధారించాల్సిన నిబంధనలను జారీ చేసింది. దీంతో పాటుగా రొయ్యలను స్తంభింపజేసి వేరుచేయడం వంటి నిబంధనలు కూడా కొనసాగుతాయి.
ఆక్లాండ్‌కు చెందిన హాస్పర్ బ్రాండ్ ల్యాబ్స్ అధినేత దిలీప్ మద్దుకూరి మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా కొన్ని కఠినమైన నిబంధనలతో భారతదేశం నుండి రొయ్యల దిగుమతికి మళ్లీ అనుమతి ఇచ్చింది. ఇవి వ్యాధి నియంత్రణకు, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన సాంకేతిక మార్పులు. 2017కి ముందు ఉన్న కొన్ని పాత షరతులు అలాగే కొనసాగుతున్నాయని తెలిపారు.
భారతదేశం నుండి రొయ్యల దిగుమతుల పునరుద్ధరణ ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రాధాన్యమైనది. దేశంలో మొత్తం రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 80 శాతం వాటా కలిగి ఉంది. అలాగే, రాష్ట్రం ఉత్పత్తి చేసే రొయ్యలలో దాదాపు 70 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.
అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు భారత రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపాయి. ట్రంప్ కాలంలో విధించిన యాంటీడంపింగ్ సుంకాలు 59.72 శాతం వరకు పెరగడంతో, ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతిదారులు అమెరికా మార్కెట్‌లో పోటీ సామర్థ్యాన్ని కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా మార్కెట్ తిరిగి తెరవడం రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగానికి ఊతమివ్వగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
గత ఎనిమిదేళ్లుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలోని దిగుమతిదారులు తమ ప్రభుత్వాలను నిషేధాలు సడలించాలంటూ ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఈ తాజా నిర్ణయంతో ఆ ఒత్తిడి ఫలితమిచ్చిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఆస్ట్రేలియా మార్కెట్ తిరిగి తెరవడంతో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ధరలు స్థిరపడతాయి, రైతుల ఆదాయం పెరుగుతుంది. రాబోయే నెలల్లో సముద్ర ఆహార ఎగుమతుల్లో గణనీయ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications