ఉద్యోగ స్థిరత్వం అనేది ఇప్పుడు ఎక్కడా కనపడటం లేదు. మహమ్మారి తరువాత జరిగిన పరిణామాలు ఉద్యోగులకు శాపంగా మారిపోయాయి. ప్రతి చోట ఉద్యోగి తన ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనే భయం మధ్య తన జాబ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల 57 ఏళ్ల వయస్సు గల ఒక టెక్నాలజీ ప్రొఫెషనల్ రెడ్డిట్ లో పంచుకున్న అనుభవం అందర్నీ షాకింగ్ కు గురి చేసింది. ఉద్యోగ భద్రత మీద మరోసారి చర్చను లేవనెత్తింది.
ఆ సీనియర్ ఉద్యోగి పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. ఒకే కంపెనీలో 25 సంవత్సరాలు పనిచేసి అకస్మాత్తుగా లేఆఫ్ నోటీసు అందుకున్నారు. దాని తరువాత ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక సవాళ్లను అందులో వివరించారు. ఇది నాకు ఊహించని షాక్‌గా వచ్చింది. అత్యంత చెత్త విషయం ఏమిటంటే.. నా వయస్సు 57 సంవత్సరాలు.. నా ప్రణాళికాబద్ధమైన రిటైర్మెంట్‌కు కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినా నన్ను 2-3 సంవత్సరాల జూనియర్ ఉద్యోగిలా బయటకు పంపడం చాలా విచిత్రంగా ఉందని ఆయన రాశారు.

ఆయన పోస్ట్‌కి అనేక మంది Reddit వినియోగదారులు స్పందించారు. చాలామంది ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారని.. ముఖ్యంగా 20+ సంవత్సరాలు ఒకే సంస్థలో పని చేసిన తర్వాత పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారిని లేఆఫ్ చేసే ఘటనలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ 57 ఏళ్ల ఉద్యోగి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌ను తాజాగా అప్‌డేట్ చేశాడు. తన రెజ్యూమెను కస్టమైజ్ చేశాడు. తన పనికి తగినట్లు కాకపోయినా నెలకు రూ.70వేలు-రూ. 90 వేల జీతం ఉన్న ఉద్యోగం కోసం చూస్తున్నట్లు తెలిపాడు. layoff జరిగినా ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని, తక్కువ ఖర్చులతో తన భార్య ఇంటి వ్యవహారాలను చూసుకుంటోందని పోస్టులో తెలిపారు.
ఒక నెటిజన్ మాట్లాడుతూ.. వినడానికి బాధగా ఉంది. నేను 20-25 సంవత్సరాలు పనిచేసి.. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నప్పుడు ఉద్యోగం కోల్పోయిన చాలా మందిని చూశాను. 55 ఏళ్లు దాటిన తర్వాత కొత్త ఉద్యోగ అవకాశాలు దొరకడం చాలా కష్టం. అందువల్ల చాలామంది ముందస్తు రిటైర్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. మరికొంత మంది ఆయనకు ఉపయోగకరమైన సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగ వేట ఎంత కఠినంగా మారిందో వివరించారు.
నా సూచన ఏమిటంటే.. దీర్ఘకాలిక నిరుద్యోగానికి మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉండండి. ఇది ఒకటి రెండు నెలల్లో పరిష్కారం అయ్యే విషయం కాదు. 50ల చివరలో ఉన్న చాలా మంది 12-18 నెలల పాటు ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా మార్కెట్‌లో అనేక నకిలీ ఉద్యోగ ప్రకటనలు.. స్కామ్‌లు కూడా ఉన్నాయి. ఏది నిజమైనది, ఏది కాదో మీరు త్వరగా నేర్చుకోవాలని తెలిపారు.
57 ఏళ్ల వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఒక సమస్యగా మారుతుంది. ఒకవైపు కొత్త అవకాశాలు పరిమితం అవుతాయి. మరోవైపు రిటైర్మెంట్ ప్లాన్‌లు దెబ్బతింటాయి. టెక్ రంగంలో నైపుణ్యాలు ఉన్నప్పటికీ.. కంపెనీలు ఎక్కువగా యువ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీని వల్ల మధ్య వయస్సు, సీనియర్ ఉద్యోగులు అనిశ్చితి ఎదుర్కొంటున్నారని ప్రస్తుత పరిస్తితులు కూడా తెలియజేస్తున్నాయి.
25 సంవత్సరాల పని చేసినా.. ఉద్యోగం ఒక్కసారిగా కోల్పోవడం ఎంత కఠినమో ఈ కథ అందరికీ మరోసారి చూపిస్తోంది. నేటి కార్పొరేట్ ప్రపంచంలో విశ్వాసం, అనుభవం కంటే లాభం, ఖర్చు తగ్గింపు ప్రాధాన్యత పొందుతున్నాయి. ఈ సంఘటన ఉద్యోగ భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా.. వయసు పెరిగేకొద్దీ కొత్త అవకాశాలు ఎంత కష్టంగా మారుతున్నాయో కూడా సూచిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications