వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకు వస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా నిన్న రూ.6 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు(మే 14) రెండో ప్యాకేజీని ప్రకటించారు. ఈ సందర్భంగా స్వల్ప అద్దె గృహాల నిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

పట్టణ పేదలు, వలస కార్మికుల కోసం అఫోర్డబుల్ రెంటల్ హౌస్
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ రెంటల్ హౌసింగ్ స్కీంను ప్రారంభిస్తుందని తెలిపారు. వలస కార్మికులతో పాటు పట్టణ పేదల కోసం దీనిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పట్టణ పేదలు, వలస కూలీలకు అందుబాటులో ఉండేలా పీపీపీ పద్ధతిలో వీటిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రాలు ఈ పథకంలో చేరితో కేంద్రం తగిన సాయం అందిస్తుందన్నారు. వలస కార్మికులకు ఇబ్బంది లేకుండా ఈ పథకం ఉంటుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దీనిని తీసుకు వస్తామని, భూమి ఉన్నవాళ్లు ముందుకు వస్తే తగిన సాయం కోసం కేంద్రం సిద్ధమని తెలిపారు.

మెట్రో నగరాల్లో ఖాళీగా ఉన్న నిర్మాణాల ద్వారా
PPP మోడల్ ద్వారా సరసమైన రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తద్వారా మ్యానుప్యాక్చరింగ్ యూనిట్స్, ఇండస్ట్రీస్‌ను ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ హౌసింగ్స్ లేదా ప్రయివేటు ఇండస్ట్రీస్‌ను ఈ స్కీంకు ఉపయోగించుకోనున్నారు. మెట్రో నగరాల్లో ఖాళీగా ఉన్న నిర్మాణాలను ఇందుకు ఉపయోగించనున్నట్లు చెప్పారు. రాయితీ ఒప్పందాల ద్వారా పీపీపీ మోడల్‌లో నిర్మిస్తారు. తక్కువ అద్దెలు ఉండేలా ఉంటుంది. మార్గదర్శకాలు త్వరలో సంబంధిత మంత్రిత్వ శాఖ విడుదల చేయనుంది.

వన్ నేషన్ వన్ రేషన్
ఆగస్ట్ నాటికి వన్ నేషన్-వన్ రేషన్ కార్డును అమలు చేస్తామన్నారు. దీంతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చునన్నారు. రూ.50 వేల రుణాలు తీసుకున్న వారికి ముద్ర, శిశు రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని, దీంతో 3 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. 50 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు రూ.10,000 వరకు రుణం పొందవచ్చునని చెప్పారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications