IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. జాబితా తర్వాత కూడా వెర్రిగా షేర్లు కొంటున్న ఇన్వెస్టర్స్..

Aeron Composite IPO: మార్కెట్లు పతనంలో కొనసాగుతున్నప్పటికీ.. ఐపీవోలు మాత్రం గ్రాండ్ లిస్టింగ్ నమోదు చేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు డబ్బుల వర్షంలో మునిగి తేలుతున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఏరోన్ కాంపోజిట్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు 20 శాతం ప్రీమియం ధర రూ.150 వద్ద విజయవంతంగా సబ్‌స్క్రిప్షన్ నమోదు చేసింది. వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఏరోన్ కాంపోజిట్ ఒక్కో షేరును రూ.125 గరిష్ఠ ధరకు ఇష్యూ చేయగా.. రూ.150కి జాబితా అయ్యాయి. లిస్టింగ్ తర్వాత కూడా బలమైన పెరుగుదలను చూస్తోంది. ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలుకు దిగటంతో లిస్టింగ్ తర్వాత గరిష్ఠంగా రూ.157.50 స్థాయికి చేరుకుంది.

Aeron Composite IPO saw heavy buying from investors after bumper listing Today

కంపెనీ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.56.10 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో ఐపీవో ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30 వరకు తెరచి ఉంది. ఈ క్రమంలో కంపెనీ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.121-125గా నిర్ణయించింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.15.17 కోట్లను విజయవంతంగా సమీకరించిన కంపెనీ ఐపీవోలో మెుత్తంగా 44.88 లక్షల తాజా షేర్లను విక్రయించింది. ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం మంచి స్పందనను పొందింది.

ఐపీవో నుంచి సేకరించిన నిధులను కంపెనీ సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం, అదనపు ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయడానికి కంపెనీ ఉపయోగించాలని చూస్తోంది. ఫైబర్ గ్లాస్ రీన్ఫోర్స్డ్ పాలిమర్ ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్న కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 29 ఫిబ్రవరి 2024 వరకు రూ.9.42 కోట్లు పన్నుల తర్వాత లాభాన్ని చూసింది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.179.38 కోట్లుగా ఉంది.

Ecos Mobility..
ఇదే క్రమంలో నేడు మార్కెట్లో జాబితా అయిన మరో ఐపీవో Ecos Mobility 17 శాతం ప్రీమియం ధరతో లిస్టింగ్ అయ్యింది. దీంతో ఒక్కో షేరు రూ.390 ధర వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే కంపెనీ ఇష్యూ సమయంలో రూ.334 రేటు వద్ద విక్రయించింది. అయితే కంపెనీ గ్రేమార్కెట్లలో పలికిన ప్రీమియం ధరను అందుకోవటంలో విఫలమైంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.601 కోట్లను నేడు విజయవంతంగా సమీకరించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+