IPO News: ఐపీవో కోసం ఎగబడ్డ జనం.. తెరవగానే ఫుల్ సబ్‌స్క్రైబ్.. షాకింగ్..
IPO News: నేడు సబ్‌స్క్రిప్షన్ కోసం మార్కెట్లోకి ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఐపీవో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మెుదటి రోజే ఇది ఇన్వెస్టర్ల నుంచి ఊహించని స్థాయిలో.. ఉత్తమమైన స్పందనను పొందింది.
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. కంపెనీ IPO ఆగస్టు 22న అంటే ఈరోజు ప్రారంభమైంది. కేవలం కొన్ని గంటల సమయంలోనే ఇష్యూ చేసిన షేర్లు పూర్తిగా సబ్‌స్క్రైబ్ కావటం మార్కెట్లో దీనికి ఉన్న క్రేజ్ గురించి చెబుతోంది. మధ్యాహ్నం 1.40 గంటల వరకు ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఐపీవో దాదాపు 4 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.

కంపెనీ రూ.2 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేరు ధరను రూ.102-రూ.108 మధ్యన ఉంటుందని ప్రైస్ బ్యాండ్ ప్రకటించింది. అలాగే లాట్ సైజ్ 130 షేర్లను కలిగి ఉంటుందని తెలిపింది. ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీలో ఒక్క లాట్ షేర్లను కొనుగోలు చేయాలంటే అందుకు రూ.14,040 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐపీవో 24 ఆగస్టు 2023 వరకు తెరచి ఉంటుంది.
మధ్యాహ్నం 1.42 గంటల సమయంలో ఐపీవో రిటైల్ విభాగంలో 4.17 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల విభాగంలో 1.05 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 7.11 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఇదే క్రమంలో గ్రే మార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.68 ప్రీమియం ధరకు ట్రేడవుతున్నాయని టాప్ బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. అంటే మార్కెట్ లిస్టింగ్ ధర దాదాపు రూ.176 వద్ద ఉండవచ్చని తెలుస్తోంది. నిన్న గ్రే మార్కెట్లో కంపెనీ షేర్ ప్రీమియం రూ.58గా ఉంది.


Click it and Unblock the Notifications