IPO News: చాలా కాలం తర్వాత మళ్లీ మార్కెట్లోకి సూపర్ ఐపీవో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఏరోఫ్లెక్స్ తెరచిన మెుదటి రోజు నుంచే ఇన్వెస్టర్ల నుంచి భారీ ఆదరణను పొందుతోంది.
దేశవ్యాప్తంగా అనేక మంది ఇన్వెస్టర్లు ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ IPOపై భారీగా పందెం వేస్తున్నారు. దీంతో తొలిరోజే ఫుల్ సబ్‌స్క్రిప్షన్ పొందిన ఐపీవో చివరి రోజు నాటికి 97 రెట్లు కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. గ్రే మార్కెట్‌లోనూ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ షేర్లకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. రూ.102-108 ప్రైస్ బ్యాండ్‌గా ఉన్న ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఐపీవో షేర్లు 65% కంటే ఎక్కువ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

గ్రేమార్కెట్లో ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ప్రీమియం రూ.72గా ఉంది. ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఇది సూచిస్తుంది. ఈ లెక్కన షేర్లను కంపెనీ ఎగువ ప్రైస్ బ్యాండ్ ధర రూ.108 వద్ద అలాట్ చేసినట్లయితే లిస్టింగ్ రోజున స్టాక్ ప్రీమియం ధరతో రూ.180 వద్ద లిస్టింగ్ జరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల షేర్లను పొందిన పెట్టుబడిదారులు లిస్టింగ్ రోజున తమ మెుత్తం పెట్టుబడిపై 65% కంటే ఎక్కువ లాభం పొందవచ్చు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం Aeroflex Industries IPO మెుత్తంగా 97.11 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఐపీవో రిటైల్ కోటా 34.41 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా(NII) 126.13 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 194.73 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఐపీఓలో కంపెనీ షేర్ల కేటాయింపు ఆగస్టు 29న ఖరారు కావొచ్చు. అలాగే స్టాక్ ఆగస్టు 31న ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications