Aeroflex Industries IPO: దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అదృష్టం ఈ ఏడాది ఐపీవోల రూపంలో వచ్చి పడింది. గ్యాప్ లేకుండా వస్తున్న ఐపీవోలు ఊహించిన లాభాలను తెచ్చిపెడుతూ రోజుల్లోనే ధనవంతులను చేస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఐపీవో మార్కెట్లో లిస్టింగ్ జరిగింది. ప్రఖ్యాత ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా మద్దతుగల ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ తన షేర్లను ఒక్కోటి రూ.108 రేటుకు ఇష్యూ చేయగా.. నేడు మార్కెట్లో 82.78 శాతం ప్రీమియం ధరకు మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి. ఎన్ఎస్ఈలో స్టాక్ ధర రూ.190తో, బీఎస్ఈలో రూ.197.40 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

కంపెనీ రూ.351 కోట్ల పెట్టుబడిని మార్కెట్ నుంచి పూల్ చేసేందుకు తన ఐపీవోను ఆగస్టు 22-24 మధ్య కాలంలో సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచింది. ఈ సమయంలో ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన అపూర్వ స్పందనతో 97.11 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులు 194.73 రెట్లు రిజర్వ్ చేయబడిన పోర్షన్ కొనుగోలు చేశారు. అధిక నెట్‌వర్త్ వ్యక్తులు కోటా 126.13 రెట్లు, రిటైల్ పెట్టుబడిదారుల పోర్షన్ 34.41 రెట్లు కొనుగోలు చేశారు.

ఫ్లెక్సిబుల్ ఫ్లో సొల్యూషన్స్ కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ సాట్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ. ఇది పర్యావరణ అనుకూల మెటాలిక్ ఫ్లెక్సిబుల్ పైప్స్ తో పాటు ఇతర ఉత్పత్తులను తయారు చేస్తోంది. కంపెనీ EV మొబిలిటీ, సెమీకండక్టర్ మరియు కొత్త-యుగం గురించి కూడా చూస్తున్నట్లు ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అసద్ దౌద్ తెలిపారు. కంపెనీ ఇప్పటికే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ సజావుగా ప్రవహించేలా వివిధ పరిశ్రమలకు మేము కీలకమైన భాగాలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications