Dividend Stock: ఈ రోజుల్లో చాలా మంది రెండో ఆదాయం కోసం స్టాక్ మార్కెట్ పెట్టుబడులను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. అలాంటి వారు ఎక్కువగా డివిడెండ్ రూపంలో ఆదాయాన్ని ఇచ్చే కంపెనీల్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటారు. ఇలా ఆదాయాన్ని ఎలా పొందాలి అని ఆలోచించే వారు ఈ స్టాక్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.

కంపెనీ వివరాలు..
ఇప్పటికే మల్టీబ్యాగర్ రాబడులతో తన ఇన్వెస్టర్ల సంపదను ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కంపెనీ రెట్టింపు చేసింది. కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటి నుండి 42,400 శాతం రాబడిని ఇచ్చింది. ఇదే క్రమంలో తాజాగా ఈ స్టాక్ లో పెట్టుబడి పెట్టిన వారికి కంపెనీ డివిడెండ్ ఆదాయాన్ని కూడా ఇవ్వబోతోంది.

డివిడెండ్ పొందటానికి గడువు..
2022-23 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన షేర్‌హోల్డర్‌లకు ఒక్కో షేరుకు రూ.1.50 డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఇదే సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో పొందుపరిచింది. దీనిలో భాగంగా.. ఆగస్టు 23ని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. అంటే, ఈ రోజు కంపెనీ ఎక్స్-డివిడెండ్ లాగా ట్రేడవుతోంది. కంపెనీ డివిడెండ్‌ను 9 సెప్టెంబర్ 2022న లేదా అంతకు ముందు చెల్లిస్తుందని సమాచారం.

దిమ్మతిరిగే రాబడులు..
ఈ కంపెనీ జనవరి 1, 1999న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. అప్పటి నుంచి ఆగస్టు 19, 2022 వరకు షేర్లు 42,400 శాతం పెరిగాయి. ప్రారంభం రోజున స్టాక్ ధర కేవలం 60 పైసలు మాత్రమే. అప్పట్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి దానిని ఎవరైనా ఇన్వెస్టర్ ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే.. రూ.4.24 కోట్లను పొందేవారు. ఐదేళ్లలో కంపెనీ షేర్లు 34.28 శాతం లాభపడ్డాయి. కంపెనీ 52 వారాల గరిష్ఠ ధర రూ.291గా ఉంది.

డివిడెండ్ ఆదాయం అంటే ఏమిటి..?
కంపెనీలకు తమ వ్యాపారాల నిర్వహణ ద్వారా లాభాలు వస్తాయి. అయితే వాటిలో టాక్సులు, ఇతర చట్టపరమైన చెల్లింపులు చేసిన తరువాత మిగిలిన లాభాలను కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు కూడా కంపెనీలు ఇస్తాయి. ఇలా ఒక్కో షేరుకు కంపెనీలు చెల్లించే లాభాన్ని డివిడెండ్ అని అంటారు. మంచి ఫండమెంటల్స్ ఉండే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టిన వారికి ఇదొక మంచి ఆదాయ వనరు.

డివిడెండ్ అందించే కొన్ని స్టాక్స్..
Vedanta, NMDC, Standard Indstries, REC Ltd, Power Fin Corp, HUDCO, ONGC, GAIL (India), Coal India, Hinduja Global వంటి కంపెనీలు దేశంలో మంచి డివిడెండ్ చెల్లిస్తున్న కంపెనీల జాబితాలో ముందంజలో ఉన్నాయి.
NOTE: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఆదారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. మీ ఆర్థిక సలహదారులను సంప్రదించిన తరువాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి.


Click it and Unblock the Notifications