Advit Jewels IPO: ఇన్వెస్టర్లకు పండుగ చేయనున్న అద్విత్ జువెల్స్.. గ్రే మార్కెట్లో దూసుకెళ్తున్న షేర్లు..!
నగల తయారీ, అమ్మకాల కంపెనీ అద్విత్ జువెల్స్ కంపెనీ ఐపీఓ ఈ రోజుతో ముగిసింది. ఈ ఐపీఓకు భారీ స్పందన వచ్చింది. ఈ ఐపీఓ 210 రెట్లు సబ్స్క్రిప్షన్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ కోటాలో 91.25 రెట్లు, ఎన్ఐఐఎస్ కోటాలో 534.53 రెట్లు, క్యూఐబీఎస్ కోటాలో 174.98 రెట్లు సబ్స్క్రిప్షన్ అయింది.
గ్రే మార్కెట్ లో అద్విత్ జువెల్స్ షేర్లు ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి. అద్విత్ జ్యువెల్స్ షేర్లు 44 శాతానికి పైగా పెరిగినట్లు చూపిస్తున్నారు. ఐపీఓ ప్రైస్ కంటే రూ.61 ఎక్కవగా చూపిస్తుంది. ఇదే స్థాయిలో ఉంటే ఇది 44.20 శాతం లిస్టింగ్ లాభాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే మిగతా ఐపీఓలకు ఇంత డిమాండ్ రాలేదు. కాగా అద్విత్ జువెల్స్ షేర్లు జూన్ 29న కేటాయించనున్నారు. రీఫండ్, షేర్ల జమ జూన్ 30న జరుగుతుంది. జూలై 1న అద్విత్ జ్యువెలర్స్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నాయి. కాగా ఒక్కో షేరు ధరను రూ.130 నుంచి రూ.138 గా నిర్ణయించారు. ఇందులో పెట్టుబడి పెట్టాలంటే కనీసం ఒక లాట్ అయిన కొనుగోలు చేయాలి. ఒక్క లాట్ కు రూ. 13,800 పెట్టుబడి పెట్టాలి. ఒక లాట్ లో 100 షేర్లు ఉంటాయి. జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఆభరణాల తయారీ సంస్థ, కొత్త ఈక్విటీ షార్ల జారీ ద్వారా రూ.165.16 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 49.52 కోట్లను సమీకరించింది. ఇందులో మ్యూచువల్ ఫండ్లు కూడా ఉన్నాయి.

ఈ కంపెనీపై బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అద్విత్ జువెల్స్ ను 2019లో స్థాపించారు. ఈ కంపెనీ రాంభాజో అనే బ్రాండ్ తో చేతితో తయారు చేసిన కుందన్, పోల్కి, వజ్రాలు, స్టడెడ్ ఆభరణాలు విక్రయిస్తుంది. అద్విత్ జువెల్స్ ఎక్కువగా బీ2బీ(బిజినెస్ టూ బిజినెస్) వ్యాపారం చేస్తోంది. ఆర్డర్‌పై ప్రత్యేకంగా తయారుచేసే ఆభరణాల ద్వారా B2C(బిజినెస్ టూ కస్టమర్) వినియోగదారులకు కూడా సేవలు అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు బాగుండడంతో పాటు త్వరలోనే పెద్ద ఐపీఓలు అయిన జియో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వస్తుండడంతో అందరి దృష్టి ఐపీఓలపై పడింది.
ఐపీఓలో షేర్లు అలాట్ కావాలంటే ఒకరి డీమ్యాట్ ఖాతా నుంచి కాకుండా మల్టీపుల్ డీమ్యాట్ ఖాతాల నుంచి ఐపీఓకు దరఖాస్తు చేసుకుంటే షేర్లు అలాట్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications