Celebrities News: కోట్లాది రూపాయలను తీసుకుని పలు ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలపై ASCI కన్నెర్రజేసింది. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల్లో వారి పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వివిధ విభాగాలకు సంబంధించి వేలాది ఫిర్యాదులపై చర్యలకు తీసుకునేందుకు సిద్ధమైంది.
సెలబ్రిటీలు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న 101 ప్రకటనలపై ఫిర్యాదులను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రాసెస్ చేసింది. ASCI కోడ్‌ను ఉల్లంఘించే ప్రకటనలలో ప్రముఖులు కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం 101 మంది సెలబ్రిటీలు తప్పుదారి పట్టించే ప్రకటనల్లో నటించినట్లు గుర్తించింది. వారు ASCI మార్గదర్శకాలను పాటించనట్లు కనుగొంది.

ఈ తరహా ఉల్లంఘనల్లో 5 కేటగిరీలను ASCI హైలెట్ చేసింది. వ్యక్తిగత సంరక్షణ (22 శాతం), ఆహారం మరియు పానీయాలు (21 శాతం), బెట్టింగ్ (20 శాతం), ఆరోగ్య సంరక్షణ (9 శాతం) మరియు డ్యూరబుల్స్ (6 శాతం) విభాగాల్లో ఇవి అధికంగా జరిగినట్లు తేల్చింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు 3 వేల 200 ప్రకటనలను ASCI నేరుగా వివిధ నియంత్రణ సంస్థలకు నివేదించింది.
చట్టవిరుద్ధమైన 1311 ఆఫ్‌షోర్ బెట్టింగ్ ప్రకటనల కేసులను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు అడ్వర్టైజింగ్ అథారిటీ అందించింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద సంభావ్య ఉల్లంఘనల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖకు 1249 ఆరోగ్య సంరక్షణ ప్రకటనలను ఎస్కలేట్ చేసింది. ఇందులో ఆల్కహాలిక్ పానీయాలపై 82, పొగాకు మరియు పొగాకు ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి 65 ప్రకటనలు ఉన్నాయి.
ASCIకు అందిన మొత్తం 10 వేల 93 ఫిర్యాదుల్లో 8 వేల 299 ప్రకటనలను పరిశీలించింది. వాటిలో మెజారిటీ 81 శాతం ఉల్లంఘనలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. 34 శాతంతో తదనంతర స్థానంలో హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేసే ప్రకటనలు ఉన్నాయి. ప్రాసెస్ చేయబడిన యాడ్స్‌లో డిజిటల్ యాడ్స్ 85 శాతం కాగా ఉల్లంఘనలు రేటు ఎక్కువగా ఉంది. ఇక ప్రింట్ మరియు TV ప్రకటనల్లో అత్యంత తక్కువ ఉల్లంఘనల రేటు నమోదైంది.


Click it and Unblock the Notifications