Investment: వృద్ధికి సంబంధించినంత వరకు భారతదేశం చీకటి మధ్య ఒక వెలుగు వెలిగింది. భారత స్టాక్ మార్కెట్లపై JP మోర్గాన్ చీఫ్ ఆసియన్, ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ అడ్రియన్ మోవాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవుట్‌పెర్ఫార్మెన్స్ ఓవర్ వాల్యుయేషన్‌కు దారితీసినందున.. ఇండియాలో స్టాక్ సిఫార్సులను చేయటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో స్టాక్స్ కనుగొనటం కంటే ఇండియా మార్కెట్లలో సరైన స్టాక్స్ కనుగొనటానికి చాలా కష్టపడుతున్నట్లు మోవాట్ తెలిపారు. తన పెట్టుబడి ప్రాధాన్యతల్లో ప్రస్తుతం ఇండియా కంటే ఎక్కువగా కొరియా, తైవాన్, చైనా మార్కెట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం చైనా తన జీరో కోవిడ్ పాలసీని విరమించుకోవటంతో ఆర్థిక వ్యవస్థ తెరచుకుని దూకుడుగా ముందుకు సాగుతోంది. వ్యాల్యుయేషన్ల పరంగా మంచి కంపెనీలు పెట్టుబడికి అక్కడ అందుబాటులో ఉండటంతో చౌక పెట్టుబడుల ద్వారా లాభాన్ని ఆర్జించేందుకు విదేశాల పెట్టుబడులు క్యూ కట్టాయని ఆయన తెలిపారు.

కొరియా విషయానికి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా గొలుసుకు చాలా మంచి ఎక్స్పోజర్ పొందారు. కాబట్టి ఈ సమయంలో ఆ మార్కెట్లకు మంచి అవకాశాలు ఉన్నాయని మోవాట్ అన్నారు. తైవాన్ ప్రధాన సూచీలు దాని ఒక సంవత్సరం ఫార్వర్డ్ ఎర్నింగ్స్‌కి 14.36 రెట్లు, దక్షిణ కొరియా 12.85 రెట్లు, చైనా 10.83 రెట్లు వద్ద ట్రేడవుతున్నాయి. అయితే భారత్ విషయంలో ఇది 18 రెట్లు ఉండటంతో మార్కెట్లు అత్యంత ఖరీదుగా మారాయి.
అదానీ గ్రూప్ స్టాక్స్ ధరల్లో డీప్ కరెక్షన్ చూసినప్పటికీ మోవాట్ కూడా ఆసక్తి చూపలేదు. స్టాక్ ధరల తారుమారు, అకౌంటింగ్ మోసాలకు అదానీ గ్రూప్ పాల్పడిందంటూ షార్ట్ సెల్లర్ నివేదికతో జనవరి 24 నుంచి అదానీ స్టాక్స్ ఏకంగా 60 శాతానికి పైగా పడిపోయాయి. అయితే వీటిలో వాస్తవం లేదని గౌతమ్ అదానీ ఖండించారు. ప్రధానంగా అధిక వ్యాల్యూయేషన్ల కారణంగా ఇన్వెస్టర్లు కొంత ఆందోళనలకు గురవటంతో ఇలా జరిగిందని అడ్రియన్ మోవాట్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications