మారుతున్న టెక్నాలజీతో పాటుగానే ఉద్యోగాలు, ఉద్యోగుల్లో అనేక మార్పులు వస్తున్నాయి. భారతదేశంలో సగం మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలనుకోవటంపై వచ్చిన సంచలన రిపోర్ట్ మార్కెట్లను కుదిపేస్తోంది.
భారత దేశంలోని పరిస్థితులపై ప్రఖ్యాత టెక్ దిగ్గజం అడోబ్ కీలకమైన రిపోర్టు విడుదల చేసింది. నాసిరకం సాంకేతిక సాధనాలు ఉత్పాదకతను దెబ్బతీస్తాయని 93 శాతం మంది నాయకులు, 87 శాతం ఉద్యోగులు భావిస్తున్నారని పేర్కొంది. దేశంలోని ఉద్యోగులపై సాంకేతికత ఎక్కువగా ప్రభావితం చేస్తోందని వెల్లడైంది.

ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) విషయానికొస్తే 98 శాతం మంది భారతీయ ఉద్యోగులు తమకు జనరేటివ్ AI సహాయకరంగా, అద్భుతంగా ఉందని చెప్పారు. 94 శాతం మంది ఆటోమేషన్ గురించి అదే విషయాన్ని చెప్పారు. ఇటీవలి సర్వే ప్రకారం 88 శాతం నాలెడ్జ్ వర్కర్లు, 94 మంది లీడర్లు తమ కంపెనీల్లో జనరేటివ్ ఏఐ ఉపయోగించాలని అంటున్నప్పటికీ.. 6 శాతం మంది మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీటి వినియోగానికి భద్రతాపరమైన సమస్యలపై ఎక్కువ మంది ప్రధాన అడ్డంకిగా చెబుతున్నారు.
ప్రస్తుతం తరుణంలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇండెలిజెన్స్ వంటి సాంకేతికతల ప్రభావం తక్కువగా అంచనా వేయలేమని అడోబ్ ఇండియాలో సీనియర్ డైరెక్టర్, డిజిటల్ మీడియా బిజినెస్ హెడ్ గిరీష్ బాలచంద్రన్ అన్నారు. ఇవి సాంప్రదాయ పనిని విప్లవాత్మకంగా మార్చగలిగే శక్తిని కలిగి ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి తరుణంలో ఎక్కువ మంది ఏఐ వినియోగాన్ని పెంచాలని అంటున్నప్పటికీ.. కేవలం 59 శాతం కంపెనీలు మాత్రమే దేశంలో ప్రస్తుతం దీనిని ఉపయోగిస్తున్నాయని అడోబ్ నివేదిక పేర్కొంది.


Click it and Unblock the Notifications