Adobe CEO: ప్రస్తుతం అమెరికాలోని అనేక ప్రసిద్ధ టెక్ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులు సీఈవోలుగా ఉన్నారు. వారిలో అడోబ్ సీఈవో శంతను నారాయణ్ కూడా ఒకరు. అయితే హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శంతను ప్రయాణం అమెరికా వరకు ఎలా సాగింది అనే విషయాన్ని ఆయన ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. ఆయన ప్రసంగం టెక్ సిబ్బంది ఆలోచనలను మార్చేసింది.

భారతీయులు..
టెక్ ప్రపంచంలో చాలా మంది ఔత్సాహిక టెక్కీలకు ఉండే కల అమెరికా వెళ్లి స్థిరపడాలి అన్నదే. హైదరాబాద్ ఇప్పుడు ఉన్న విధంగా తన కెరియర్ ప్రారంభ సమయంలో ఉండి ఉంటే తాను అమెరికా వెళ్లే వాడిని కాదని అడోబ్ సీఈవో శంతను నారాయణ్ అనటం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

హైదరాబాద్ సదస్సులో..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన టై గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి అడోబ్ సీఈవో శంతను నారాయణ్ అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం వ్యాపార వాతావరణం చాలా బాగుందని.. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, కార్యదర్శి జయేష్ రంజన్ కృషిని అభినందించటం దేశంలో హైదరాబాద్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతోంది.

ఈ తరం..
ప్రస్తుత కాలంలో తాను పుట్టి హైదరాబాద్‌లో పెరిగి ఉంటే ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లేవాడిని కాదని సమావేశంలో ఆయన అనటం భారత ఐటీ పురోగతిలో హైదరాబాద్ పాత్రకు అద్ధం పడుతోంది. ప్రస్తుతం టెక్కీలకు అవకాశాలు దేశంలోనే అధికంగా ఉన్నాయని శంతను అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరి కలలు నిజం చేసుకోవటంలో కొత్త టెక్నాలజీలు చాలా అవకాశాలను అందిస్తున్నాయని అన్నారు.

భారత సీఈవోలు..
2007లో గూగుల్‌కి చెందిన సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కు చెందిన సత్య నాదెళ్ల కంటే ముందే అడోబ్ సీఈవోగా శంతను బాధ్యతలు చేపట్టారు. ఆయన అభివృద్ధి చేసిన సబ్‌స్క్రిప్షన్ మోడల్ అడోబ్ విపరీతంగా అభివృద్ధి చెందడానికి సహాయపడింది. అలా 2007లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన శంతను నారాయణ్.. 2008లో కంపెనీలో కీలక మార్పులు తీసుకురావటం కంపెనీ పురోగతికి దోహదపడింది. మాంద్యం వల్ల అడోబ్ ఆదాయం 25 శాతం తగ్గినప్పటికీ ఆయన నేతృత్వంలో కంపెనీ 200 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

విజయం..
హైదరాబాద్‌లో జరిగిన TiE గ్లోబల్ సమ్మిట్‌లో దాని విజయపథాన్ని పూర్తిగా వివరించిన తర్వాత తన ఆలోచన విజయవంతమైంది కాబట్టే దానిని అందరి ముందు చెబుతున్నానని అన్నారు. తన తర్వాత వచ్చే కంపెనీ అగ్ర నాయకులు తాను విఫలమైతే తప్పులను జాబితా చేసేవాడని అన్నారు.


Click it and Unblock the Notifications