Multibagger Stock: తలరాత మార్చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. కోటీశ్వరులను చేసింది..
Multibagger Stock: దీర్ఘకాలం ఎందుకు పెట్టుబడులను కొనసాగించాలో మల్టీబ్యాగర్ షేర్లను చూస్తే తెలుస్తుంది. వేల రెట్ల రాబడులను అందించి కోటీశ్వరులను చేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆదిత్య విజన్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. కేవలం మూడేళ్ల కాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించి వారి తలరాతను మార్చేసింది. ఈ కాలంలో మల్టీ-బ్రాండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ చైన్ షేర్లు 10,000 శాతం కంటే ఎక్కువ రాబడిని పెట్టుబడిదారులకు అందించింది.

3 ఏళ్ల కిందట ఆదిత్య విజన్ కంపెనీ షేర్ ధర 11 డిసెంబర్ 2020న రూ.26.60 వద్ద ఉంది. అయితే ప్రస్తుతం స్టాక్ ధర రూ.2,700 స్థాయికి చేరుకుంది. అంటే గడచిన మూడేళ్లలో 10046% రాబడిని అందించింది. ఈ లెక్కన ఎవరైనా పెట్టుబడిదారుడు మూడేళ్ల కిందట కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉన్నట్లయితే వారు కోటీశ్వరులుగా మారి ఉండేవారు. ప్రస్తుతం ఈ షేర్ల విలువ సుమారు కోటి రూపాయలు దాటింది.
ఏప్రిల్ 19, 2023న కంపెనీ షేర్లు రూ.1,426.10గా ఉంది. అలాగే ఆరు నెలల కిందట ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టినట్లయితే ప్రస్తుతం 90 శాతం లాభాన్ని పొందేవారు. అలాగే ఏడాది ఇప్పటి వరకు ఆదిత్య విజన్ షేర్లు 76% పెరిగాయి. 1999లో పాట్నాలో స్థాపించబడిన కంపెనీ ప్రస్తుతం జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో 100కి పైగా షోరూమ్‌లను నిర్వహిస్తోంది. ఈరోజు 12.16 గంటల సమయంలో ఆదిత్య విజన్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.2,723.70 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో 52 వారాల కనిష్ఠ ధర రూ.1,140 ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.2,878గా ఉంది.


Click it and Unblock the Notifications