Multibagger Stock: మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే అవి వేరువేరు రంగాల్లో ఉండటం కనుగొనటానికి కొంత ఇబ్బంది ఉంటుంది. మార్కెట్లపై సరైన అవగాహన ఉండేవారు ఇలాంటి కంపెనీలను ముందుగానే గుర్తించి వాటిలో లాభాలను పొందుతుంటారు.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఆదిత్య విజన్ కంపెనీ షేర్ల గురించే. ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు స్వల్పకాలంలోనే కాక దీర్ఘకాలంలోనూ ఊహించని రాబడులను అందించింది. గడచిన ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 100 శాతం రాబడిని ఈ కంపెనీ షేర్లు అందించాయి. అయితే ఒకి స్మాల్ క్యాప్ కంపెనీ షేర్లు ఇంత మంచి రాబడులను ఇవ్వటం ఇదే మెుదటిసారి కాదు. గడచిన మూడేళ్ల కాలంలో స్టాక్ ఏకంగా 8,250 శాతం రాబడిని తన ఇన్వెస్టర్లకు కంపెనీ అందించింది.

కరోనా సమయంలో వ్యాపారాలతో పాటు స్టాక్ మార్కెట్లు సైతం భారీగా క్షీణించాయి. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.18 వద్ద ఉంది. అయితే మూడేళ్ల తర్వాత స్టాక్ కరోనా ముందు స్థాయిలకు తిరిగి బౌన్స్ బ్యాక్ కావటంతో స్టాక్ ధర రూ.1,500 స్థాయికి తిరిగి చేరుకుంది. గతచిన ఏడాది కాలంలో ఈ బిహార్ ఆధారిత కంపెనీ ఇన్వెస్టర్ల డబ్బును డబుల్ చేసింది. ఈ క్రమంలో స్టాక్ రూ.710 ధర నుంచి రూ.1,500 స్థాయికి చేరుకుని మల్టీబ్యాగర్ రాబడులను అందించింది.
ఎవరైనా ఇన్వెస్టర్ నెలరోజుల కిందట ఆదిత్య విజన్ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే దాని విలువ ప్రస్తుతం రూ.1.015 లక్షలోకు చేరుకునేది. ఏడాది కిందట లక్ష పెట్టుబడిపెట్టి ఉంటే దాని విలువ రూ.2.10 లక్షలకు చేరుకునేది. రెండేళ్ల కిందట లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ రూ.8 లక్షలకు చేరుకుని ఉండేది. అలాగే ఎవరైనా ఇన్వెస్టర్ మూడేళ్ల కిందట ఈ మల్టీబ్యాగర్ స్టాక్ లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని విలువ ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రూ.83.50 లక్షలకు చేరుకుని ఉండేది.


Click it and Unblock the Notifications