Rocket Stock: లక్షను రూ.70 లక్షలు చేసిన స్టాక్.. మూడేళ్లలో తలరాత మార్చిన స్టాక్.. మీ దగ్గర ఉందా..?

Rocket Stock: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌లతో కూడుకున్నది. అయితే ఇలాంటి సందర్భంలోనూ సరైన స్టాక్స్ ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెడితే ఎలాంటి వారికైనా లాభాలు తప్పక వస్తాయని మరోసారి రుజువు చేస్తోంది ఈ స్టాక్. అయితే స్వల్ప కాలంలో లక్షను ఏకంగా రూ.70 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ షేర్ హిస్టరీ..

కంపెనీ షేర్ హిస్టరీ..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది దలాల్ స్ట్రీట్‌లో లిస్ట్ అయిన పెన్నీ స్టాక్ ఆదిత్య విజన్ గురించే. గడచిన ఆరేళ్ల కాలంలో కంపెనీ షేర్ ధర ఏకంగా రెండకెల నుంచి నాలుగంకెలను స్థాయికి చేరుకుంది. మూడేళ్ల కిందట రూ.20 దగ్గర ఉన్న కంపెనీ షేర్ల విలువ ప్రస్తుతం రూ.1,390కు చేరుకుంది. ఏడాది ప్రాతిపధికన స్టాక్ ధర రూ.630 నుంచి రూ.1,390కి చేరుకుంది. మూడేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు స్టాక్ ఏకంగా 6900 శాతం వరకు రాబడిని అందించింది.

గత నెలలో..

గత నెలలో..

ఆదిత్య విజన్ షేర్ ధర గత నెలలో దాదాపు 12 శాతం పడిపోయింది. గత ఆరు నెలల్లో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ దాదాపు రూ.780 నుంచి రూ.1,390 స్థాయిలకు పెరిగింది. ఈ సమయంలో స్టాక్ 75 శాతం వరకు పెరిగింది. ఎవరైనా ఇన్వెస్టర్ షేర్ ధర రూ.20 దగ్గర ఉన్న సమయంలో ఇందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వారు రూ.70 లక్షలు రాబడిని పొందేవారు. కనీసం ఆరు నెలల కిందట ఇన్వెస్ట్ చేసినా దాని విలువ ప్రస్తుత రూ.1.75 లక్షలుగా ఉండేది. అయితే ఈ స్టాక్ దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడులను అందించి మల్టీబ్యాగర్ గా నిలిచింది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

ఆదిత్యా విజన్ కంపెనీ 1999లో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇది కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాల రిటైల్ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న దేశీయ కంపెనీ. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ అన్ని రకాల కన్స్యూమర్ డ్యూరబుల్స్‌లో డీల్ చేసే మల్టీ-బ్రాండ్ స్టోర్లను దేశవ్యాప్తంగా కలిగి ఉంది.

2022 సంవత్సరంలో కంపెనీ మెుత్తం 1,084 ఉద్యోగులను కలిగి ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,746 వద్ద ఉండగా.. షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ.598.55గా ఉంది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ 5 శాతం లోయర్ సర్యూట్ తాకి దాదాపు రూ.73 నష్టపోయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+