ABCD Super APP: చాలా కాలంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఫిన్‌టెక్ కంపెనీలు విజయవంతమైన కో-లెండింగ్ ఏర్పాట్లను అమలు చేశాయి. ఈ మార్గంలో బిర్లా గ్రూప్ పెద్ద పాత్రే పోషిస్తోంది.
దేశంలోని స్టార్టప్ కంపెనీలు రెగ్యులేటరీ ప్రయోజనాలను పొందేందుకు ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సులపై దృష్టి సారిస్తుండగా.. మరో పక్క ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రం నేరుగా కస్టమర్లను పొందేందుకు తమ అంతర్గత సాంకేతిక నైపుణ్యాలను పెంచుతున్నాయి. ఇదే ప్లాన్ ప్రస్తుతం దేశంలోని దిగ్గజ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ సైతం ఫాలో అవుతోంది. ఇన్నాళ్లు షాడో లెండర్‌గా ఉన్న కంపెనీ.. తన మెగా డైరెక్ట్-టు-కస్టమర్ ఫిన్‌టెక్ యాప్-ABCD ద్వారా ఇకపై వివిధ ఆర్థిక ఉత్పత్తులను అందజేయడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌తో సిద్ధంగా ఉంది.

బిర్లా గ్రూప్ ప్రస్తుతం తన సూపర్ యాప్‌ను క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లో ట్రయల్ నిర్వహిస్తోంది. కంపెనీ కొత్తగా ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ డిజిటల్(ABCD) యాప్ రూపుదిద్దుకుంది. అయితే సూపర్ యాప్ ఏప్రిల్ 16న వినియోగదారుల కోసం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇందులో చెల్లింపుల నుంచి ఇన్సూరెన్స్ వరకు, క్రెడిట్ కార్డ్‌లు, అంతర్జాతీయ UPI, ఫైనాన్షియల్ గోల్ ఎనలైజర్‌లు, జనరేటివ్ AI-ఆధారిత చాట్‌బాట్‌లు, ట్యాక్స్ ప్లానర్‌లతో సహా అనేక ఆర్థిక సేవలను ఒకే గొడుగు కిందకు బిర్లా గ్రూప్ తీసుకొస్తోంది.
పూర్తి స్థాయి యాప్ కావటంతో బిర్లా గ్రూప్ ఇందులో అదనంగా వినియోగదారుల క్రెడిట్ స్కోర్, ఫైనాన్షియల్ పోర్ట్‌ఫోలియో, స్పెండ్ ఎనలైజర్ వంటి సేవలను సైతం అందుబాటులో ఉంచుతోంది. తాజా సూపర్ యాప్ క్రియేషన్ ద్వారా కంపెనీ Jio ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా డిజిటల్ ప్రయత్నించిన వాటిని అనుసరిస్తుంది. పైగా కంపెనీ ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారంలో ఇతర పెద్ద పోటీదారులైన పిరమల్, అంబానీకి చెందిన జియో, టాటా వంటి వాటితో పోటీపడుతూ.. ప్రధానంగా టెక్-అవగాహన ఉన్న 'యువ ఔత్సాహికులను' లక్ష్యంగా చేసుకుంది.


Click it and Unblock the Notifications