Gold News: ఇండియాలో బంగారం అంటే ఇష్టం లేనివారు ఉండరు అనటం అతిశయోక్తి కాదని చెప్పుకోవచ్చు. అందుకే గోల్డ్ వ్యాపారంలోకి చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపార దిగ్గజాల వరకు అనేక సంస్థలు అడుగుపెట్టాయి.
ఈ క్రమంలో తాజాగా ఆదిత్య బిర్లా గ్రూప్ సైతం బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం బిర్లాలు దాదాపు రూ.5000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇందుకోసం ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే టాటాలు, అంబానీలు పసిడి వ్యాపారంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

ఇందుకోసం కంపెనీ 'నవల జ్యువెల్స్' పేరుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తోంది. ప్రత్యేకమైన డిజైన్-లీడ్, బెస్పోక్, అధిక-నాణ్యత ఆభరణాలు, బలమైన ప్రాంతీయ టచ్ ద్వారా కస్టమర్ అనుభవాన్ని మార్చడమే ఈ వెంచర్ లక్ష్యమని కంపెనీ స్పష్టం చేసింది. తాము చేస్తున్న ఈ ప్రయత్నం వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియో ఎంపికలో భాగమని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు. ఇది కొత్త గ్రోత్ ఇంజిన్‌లలోకి ప్రవేశించడానికి, తమ ఉనికిని విస్తరించడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.
ఇప్పటికే ఈ వ్యాపార విభాగంలో టాటా గ్రూప్ తనిష్క్, అంబానీలు రిలయన్స్ జ్యువెల్స్ పేరుతో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. భారతదేశంలో ఆభరణాల మార్కెట్ 2025 నాటికి సుమారు 90 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. అలాగే రత్నాలు, ఆభరణాల మార్కెట్ దేశ GDPకి దాదాపు 7 శాతం కాంట్రిబ్యూచ్ చేస్తోంది. ప్రస్తుతం బిర్లా గ్రూప్ లోహాల నుంచి ఫ్యాషన్ రిటైల్ వరకు అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications