Ultratech Cements: గత ఏడాదిలో గౌతమ్ అదానీ నిర్మాణ రంగంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిమెంట్ వ్యాపారంలో అగ్రగామిగా మారేందుకు అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ కంపెనీలను భారీ మెుత్తాలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇది పరోక్షంగా బిర్లాలను వెనక్కి నెట్టేందుకు చేసిన ప్రయత్నం.
అయితే తాజాగా ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ఇండియా సిమెంట్స్ నుంచి రూ.315 కోట్లతో గ్రైండింగ్ ప్లాంట్‌ను కొనుగోలు చేసింది. ఇదే క్రమంలో అల్ట్రాటెక్ సిమెంట్ తన రెండు యూనిట్లను విస్తరించేందుకు అదనంగా రూ.504 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఏడాదికి 1.1 మిలియన్ టన్నుల గ్రైండింగ్ సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ సిమెంట్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ మహారాష్ట్రలోని పర్లి రైల్వే సైడింగ్‌లో ఉంది.

బోర్డు అనుమతితో ఇండియా సిమెంట్స్ నుంచి ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ సిమెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాంట్ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచుకునేందుకు దోహదపడుతుందని కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించి రూ.315 కోట్లలో రూ.307 కోట్లు త్వరలో అందుతాయని ఇండియా సిమెంట్స్ తెలిపింది. మిగిలిన రూ.8 కోట్లను వచ్చే 9 నెలల్లో అందుకోబోతున్నట్లు వెల్లడించింది. విక్రయించిన ప్లాంట్ 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.250.66 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది.
పర్లిలో సంవత్సరానికి 1.2 మిలియన్ టన్నుల మిల్లింగ్ సామర్థ్యాన్ని రూ.166.4 కోట్లతో విస్తరించనున్నారు. మహారాష్ట్రలోని తులేలో రూ.338 కోట్లతో 1.8 మిలియన్ టన్నుల గ్రైండింగ్ మిల్లును ఏర్పాటు చేయనున్నట్లు అల్ట్రాటెక్ తెలిపింది. భవిష్యత్ వృద్ధి కోసం ఈ విస్తరణ జరుగుతుంది. ఏప్రిల్ 2025-మార్చి 2026 మధ్య విస్తరణ పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. ఇండియా సిమెంట్స్ దక్షిణాదిలో సంవత్సరానికి 13 మిలియన్ టన్నుల గ్రైండింగ్ కెపాసిటీ ప్లాంట్, రాజస్థాన్‌లో 1.8 మిలియన్ టన్నుల గ్రైండింగ్ కెపాసిటీ ప్లాంట్‌ను కలిగి ఉంటుంది. బనస్వర 1.2 మిలియన్ టన్నుల క్లింకర్, 1.8 మిలియన్ టన్నుల సున్నపురాయి గనిలో ఉత్పత్తి స్థావరాన్ని కలిగి ఉంది. దీంతో నేడు అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీ షేర్ ధర రూ.9,608.25 వద్ద స్వల్ప లాభంలో కొనసాగుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications