Aditya Birla Fashion: నేడు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా కొంచెం నష్టాల్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మార్కెట్లో ఒక స్టాక్ మాత్రం తన పెట్టుబడిదారులకు భారీగా లాభాలను అందించటంతో అందరి చూపు దీనిపై పడింది.
వివరాల్లోకి వెళితే.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ షేర్లు నేడు ఇంట్రాడేలో భారీ ర్యాలీని నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్ల దృష్టి కంపెనీ షేర్లపై పడింది. కంపెనీ షేర్లు 17% పెరిగి ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ.247.40కి చేరాయి. అయితే షేర్ల ఈ పెరుగుదల వెనుక ఓ ప్రకటన ఉంది. సోమవారం నాడు కంపెనీ తన మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ వ్యాపారాన్ని కంపెనీ నుంచి వేరు చేసి ప్రత్యేక లిస్టెడ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించటమే ర్యాలీకి కారణమైంది. నేడు బీఎస్ఈలో కంపెనీ షేర్లు 16.86 శాతం పెరిగి రూ.247.40కి చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో 16.93 శాతం జంప్ చేసి రూ.247.50 వద్ద నిలిచింది.

మధుర ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ వ్యాపారంలో నాలుగు ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్‌లు ఉన్నాయి. లూయిస్ ఫిలిప్, వాన్ హ్యూసెన్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లండ్ అలాగే అమెరికన్ ఈగిల్, ఫరెవర్ 21 వంటి సాధారణ దుస్తుల బ్రాండ్‌లు ఉన్నాయి. ఇది స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్‌లు రీబాక్ , వాన్ హ్యూసెన్ క్రింద ఇన్నర్‌వేర్ వ్యాపారం కోసం బ్రాండ్ లైసెన్స్‌ను కూడా కలిగి ఉంది. అందువల్ల త్వరలో ఈ కంపెనీని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ నుంచి విభజించి ప్రత్యేక లిస్టెడ్ ఎంటిటీగా మార్చాలని బిర్లాలు నిర్ణయించటాన్ని పెట్టుబడిదారులు స్వాగతించారు. దీనితో కొనుగోళ్ల పర్వం నేడు కొనసాగింది.
బ్రోకరేజీ అంచనాలు: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ కంపెనీ షేర్లను ట్రాక్ చేస్తున్న 24 మంది విశ్లేషకుల్లో.. 10 మంది స్టాక్‌పై "SELL" రేటింగ్‌ను కొనసాగించారు. అయితే ఇదే సమయంలో ఐదుగురు మాత్రం కంపెనీ షేర్లకు "BUY" రేటింగ్‌ను కలిగి ఉన్నారు. మోర్గాన్ స్టాన్లీ స్టాక్‌పై దాని "Under Weight" రేటింగ్‌ను రూ.200 టార్గెట్ ధరతో కొనసాగించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications