ముంబై: గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌గిరి చేతులు మారింది. సుదీర్ఘకాలం పాటు గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు సారథ్యాన్ని వహిస్తూ, దిశా నిర్దేశం చేస్తూ వచ్చిన ఆది గోద్రెజ్.. తన హోదా నుంచి తప్పుకొన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి కూడా ఆయన వైదొలిగారు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగానికి మాత్రం ఆది గోద్రెజ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. ఇక గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు కొత్త ఛైర్మన్‌గా గోద్రెజ్ కుటుంబానికి చెందిన వ్యక్తే నియమితులు కానున్నారు. నదీర్ గోద్రెజ్.. కొత్త సారథిగా పగ్గాలను అందుకోనున్నారు. నదీర్ గోద్రెజ్ మరెవరో కాదు.. ఆది గోద్రెజ్ సోదరుడు.
అక్టోబర్ 1వ తేదీన నదీర్ గోద్రెజ్.. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ మేరకు ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆది గోద్రెజ్ చేసిన ప్రకటనను దానికి జత చేశారు. నాలుగు దశాబ్దాల పాటు గోద్రెజ్ కంపెనీస్‌తో తనకు అనుబంధం ఉంందని, ఓ కుటుంబ సభ్యుడిగా కొనసాగానని ఆది గోద్రెజ్ చెప్పుకొచ్చారు. ప్రతి విషయంలోనూ తనకు ప్రతి ఒక్క ఉద్యోగి నుంచి కూడా సంపూర్ణ సహకారం అందిందని అన్నారు. కలిసికట్టుగా శ్రమించడం వల్లే గోద్రెజ్ ఇండస్ట్రీస్ అత్యున్నత స్థానానికి ఎదిగిందని వ్యాఖ్యానించారు.

తాను విజయం సాధించడంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల పాత్రను విస్మరించలేనిదని ఆది గోద్రెజ్ తెలిపారు. వారికి కృతజ్ఞతలు చెప్పారు. డైరెక్టర్ల విలువైన సూచనలు, సలహాలు, గైడ్‌లైన్స్.. సంస్థను అత్యున్నత శిఖరాలకు చేర్చాయని అన్నారు. తమ సంస్థ ఉత్పత్తులను ఇన్ని సంవత్సరాలుగా ఆదిరిస్తోన్న వినియోగదారులకు ఈ సందర్భంగా ఆది గోద్రెజ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. గోద్రెజ్ కంపెనీస్‌లో భాగస్వామ్యులు, స్టేక్ హోల్డర్లు, పెట్టుబడిదారులకు థ్యాంక్స్ చెప్పారు. తన తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించనున్న నదీర్ గోద్రెజ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.
విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఆది గోద్రెజ్ పలు సంస్థల, పారిశ్రామిక సంఘాలు, సమాఖ్యలకు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఛైర్మన్‌గా పనిచేశారు. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 79 సంవత్సరాల ఆది గోద్రెజ్.. మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అడ్వైజరీ కౌన్సిల్‌కు డీన్‌గా వ్యవహరించారు. నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ స్టడీస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications