Asia Development Bank: కరోనా అనంతరం వివిధ దేశాలు తీవ్ర సంక్షోభంలోకి చిక్కుకుపోయాయి. విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం ఆయా దేశాలను దివాళా అంచుకు తీసుకువెళ్లింది. చైనాను నమ్మిన దాయాది దేశం పాకిస్తాన్ రుణభారంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికితోడు ద్రవ్యోల్బణమూ తోడు కావడంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతోంది.
25 శాతం ద్రవ్యోల్బణం రేటుతో ఆసియా మొత్తం మీద పాకిస్తాన్ అత్యధిక జీవన వ్యయాన్ని కలిగి ఉన్నట్లు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) నివేదించింది. దాని ఆర్థిక వ్యవస్థ 1.9 శాతంతో ఈ ప్రాంతంలో నాల్గవ అత్యల్ప వేగంతో వృద్ధి చెందుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ADB తన నివేదికను మనీలాలో విడుదల చేసింది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ ద్రవ్యోల్బణం రేటును 15 శాతంగా ADB అంచనా వేస్తోంది. 46 దేశాలలో మరోసారి ఇదే అత్యధిక రేటు కావడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐదవ అత్యల్ప వృద్ధి రేటు 2.8 శాతాన్ని నమోదు చేయనున్నట్లు స్పష్టం చేసింది. గతంలో పాకిస్తాన్ దక్షిణాసియాలో అత్యధిక జీవన వ్యయం కలిగి ఉన్న దేశం కాగా ఇప్పుడు యావత్ ఆసియాలో అత్యంత ఖరీదైనదిగా మారింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) మరియు ఫెడరల్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 21 శాతంగా నిర్దేశించాయి. పొరుగు దేశం చాలా కాలం పాటు స్తబ్దత దశలో ఉంది. ఇప్పటికే దాదాపు 98 మిలియన్ల మంది పేదలుగా జీవిస్తున్నారు. కాగా మరో 10 మిలియన్ల మంది ప్రజలు మరింత పేదరికంలో కూరుకుపోనున్నట్లు ప్రకటించి ప్రపంచ బ్యాంక్ గత వారం షాక్ ఇచ్చింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications