Adani news: గౌతమ్ అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న పలు వ్యాపారాల్లో పోర్టుల బిజినెస్ ఒకటి. అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) పేరిట దీన్ని విజయవంతంగా నడుపుతోంది. అయితే అదానీ పోర్టుల్లోని ఒక దానిలో జరిగిన అద్భుతం వైరల్‌గా మారింది.
APSEZ ఫ్లాగ్‌షిప్ ముంద్రా పోర్టులోకి భారత్‌లో ఇప్పటివరకు అడుగుపెట్టని ఓ అతిపెద్ద కంటైనర్ షిప్ వచ్చింది. ఈ మేరకు పోర్టు యాజమాన్యం దాన్ని స్వాగతించి ఓ స్పెషల్ రికార్డుకు సాక్షులుగా నిలిచినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. డాక్ చేయబడిన నౌక 'MSC అన్నా' పొడవు 399.98 మీటర్లు అంటే దాదాపు 4 ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన భారీ పొడవు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

'ముంద్రా వద్దకు MSC అన్నా రాక.. మెగా షిప్‌లను నిర్వహించగల పోర్ట్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. అంతేకాకుండా భారతదేశ సముద్ర వాణిజ్యాన్ని మరింత పెంపొందించడంలో కీలక పాత్రను ప్రతిబింబిస్తుంది' అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే 19 వేల 200 TEUలను మోసుకెళ్లగల సామర్థ్యం ఈ షిప్ సొంతం కావడం విశేషం.
దీని ఎరైవల్ డ్రాఫ్ట్ 16.3 మీటర్లు కాగా ఇది కేవలం అదానీకి చెందిన ముంద్రా పోర్ట్ వద్ద మాత్రమే ఉంది. ఎందుకంటే భారతదేశంలోని ఏ ఇతర ఓడరేవు కూడా డీప్-డ్రాఫ్ట్ నౌకను బెర్త్ చేయలేదు. ఈ షిప్ నుంచి ఇప్పుడు 12 వేల 500 TEUల సరుకు ఎక్స్చేంజ్ జరుగుతోంది. కాగా జూలై 2023లోనూ 399 మీటర్ల పొడవు మరియు 16 వేల 652TEUల సామర్థ్యంతో ప్రపంచంలోని అతి పొడవైన కంటైనర్ షిప్‌లలో ఒకటైన MV MSC హాంబర్గ్‌ను బెర్త్ చేయడం ద్వారా కూడా ముంద్రా పోర్ట్ రికార్డ్ సృష్టించడం గమనార్హం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications