Ambuja Cements: దేశంలోని మౌలిక సదుపాయాల రంగంలో వచ్చిన పురోగతి సిమెంట్ వ్యాపారంలోని కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్స్ నేడు తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లలో కోలాహలం కొనసాగుతోంది.
జనవరి-మార్చి త్రైమాసికంలో అంబుజా సిమెంట్స్ నికర లాభం ఏకంగా 64 శాతం పెరిగి రూ.1,055 కోట్లుగా నమోదైంది. వాస్తవానికి దీనికి కారణం కంపెనీ గౌతమ్ అదానీ నేతృత్వంలోకి రావటమేనని నిపుణులు చెబుతున్నారు. ఏడాది కిందట ఇదే కాలంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.645 కోట్లుగా ఉంది. ఉత్పత్తి వ్యయాలు తగ్గటం సైతం కంపెనీ లాభదాయకతను పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కాలంలో కంపెనీ ఆదాయం సైతం 12 శాతం పెరిగి ఏడాది ప్రాతిపదికన రూ.8,894 కోట్లకు చేరుకుంది.

తాజా ఫలితాల విడుదల తర్వాత కంపెనీ బోర్డు తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.2 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. 2024 పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే కంపెనీ నికర లాభం రూ.4,738 కోట్లుగా నమోదైంది. ఇది ఏడాది ప్రాతిపదికన 119 శాతం వృద్ధి కావటం గమనార్హం. కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత అదానీ ఫ్యామిలీ మెుత్తంగా కంపెనీలో రూ.20,000 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. అదానీ నేతృత్వంలో కంపెనీ అమ్మకాలు, పనితీరు, క్యాపెక్స్ ఆరోగ్యకరమైన వృద్ధిని గత ఆర్థిక సంవత్సరంలో సాధించాయని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
మార్చి త్రైమాసికంలో కంపెనీ కిల్న్ ఇంధన ఖర్చులు ఏకంగా 17 శాతం తగ్గటం కంపెనీ లాభదాయకతను పెంచటంలో దోహదపడింది. దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్మాణ రంగంపై ఖర్చు చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత, దేశంలో స్థిరమైన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు సిమెంట్ రంగానికి సానుకూలంగా నిలిచాయని కంపెనీ పేర్కొంది.
అలాగే సిమెంట్ ఇండస్ట్రీలో పెరుగుతున్న పోటీ, సరఫరాలో పెరుగుదల కారణంగా ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో దేశమంతటా సిమెంట్ ధరలు గణనీయంగా తగ్గిన సంగతి తెలిసిందే. నవంబర్ 2023-మార్చి 2024 మధ్య కాలంలో ఒక్కో బ్యాగ్‌కు రేటు రూ.40-45 మేర తగ్గినట్లు అనలిటిక్స్ సంస్థ CRISIL నివేదించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications