Ambuja Cements: భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ దేశంలోని కీలక ముడిపదార్ధాల వ్యాపారంలో వేగంగా విస్తరిస్తోంది. మోదీ సర్కార్ మూడో సారి కూడా అధికారంలోకి రావటంతో వేగంగా నిర్మాణ రంగం ముందుకు సాగుతున్న వేళ అదానీ అనేక కంపెనీల్లో వాటాలను కొంటూ దేశంలో అగ్రగామి సంస్థలను సైతం దడదడలాడిస్తున్నారు.
తాజాగా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న అంబుజా సిమెంట్స్ ప్రస్తుతం ఓరియంట్ సిమెంట్ కంపెనీలో కీలక వాటాలను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కొనుగోలు అంబుజా సిమెంట్స్ 2028 నాటికి 140 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని నెరవేరుస్తుందని వెల్లడైంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఓరియంట్ కంపెనీలో మెజారిటీ వాటాలను రూ.8,100 కోట్ల ఈక్విటీ విలువతో కొనుగోలు చేయనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ రిపోర్టు ప్రకారం వెల్లడైంది. ఈ కొనుగోలు అంబుజాకు అదనంగా 16.6 MTPA సామర్థ్యాన్ని జోడిస్తుందని తెలుస్తోంది.

ఓరియంట్ సిమెంట్స్ వాటాల కొనుగోలుతో ఉత్తర భారతదేశంలో అంబుజా సిమెంట్స్ వ్యాపారం పట్టుసాధించటానికి దోహదపడుతుందని వెల్లడైంది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఓరియంట్ కలిగి ఉన్న అధిక నాణ్యత గల సున్నపురాయి మైనింగ్ లీజు నిల్వలను మెరుగుపరుస్తుంది. అంబుజా మొదట ఓరియంట్ సిమెంట్‌లో 46.8% వాటాను దాని ప్రస్తుత ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారుల నుండి కొనుగోలు చేస్తుంది. డీల్ కోసం అదానీ గ్రూప్ అంతర్గతంగా నిధులను సమీకరించాలని నిర్ణయించింది. ఈ వార్తల నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ షేర్లు గడచిన 6 ట్రేడింగ్ సెషన్లలో 24 శాతం ర్యాలీని నమోదు చేసింది.
సెప్టెంబర్ త్రైమాసికాన్ని పరిశీలిస్తే ఓరియంట్ సిమెంట్ కంపెనీలో ప్రమోటర్లు 37.9 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో దేశీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు 13.38 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. తాజా డీల్ కారణంగా ఓపెన్ ఆఫర్ కింద అంబుజా సంస్థ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి చెందిన 5.34 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.395.4 చొప్పున కొనుగోలు చేస్తోంది.
తాజా డీల్ కారణంగా దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ వ్యాపార సంస్థగా కొనసాగుతున్న అదానీ గ్రూప్ మార్కెట్ షేర్ 2 శాతం మేర పెరుగుతుందని అంచనా వేయబడింది. ప్రస్తుతం ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ వ్యాపారంలో అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అల్ట్రాటెక్ సిమెంట్స్ బ్రాండ్ బలమైన కస్టమర్ బేస్ కలిగి ఉన్నందున దీనిని బీట్ చేసేందుకు ప్రస్తుతం అదానీ ప్రయత్నిస్తున్నారు.
ఉదయం 10 గంటల సమయంలో అంబుజా స్టాక్ స్వల్ప నష్టంతో ఎన్ఎస్ఈలో రూ.568 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో ఓరియెంట్ సిమెంట్ కంపెనీ షేర్లు మంగళవారం రూ.352.25 వద్ద తమ ప్రయాణాన్ని ఒడిదొడుకుల్లో కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఓరియంట్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,210 కోట్లుగా ఉంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications