ముంబై: షేర్ మార్కెట్‌లో కొత్త పబ్లిక్ ఇష్యూ సందడి చేయబోతోన్నాయి. దీపావళి ట్రేడింగ్ ఆనవాయితీని కొనసాగిస్తూ- టాప్ కంపెనీలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయడానికి సమాయాత్తం కానున్నాయి. దీపావళి కంటే ముందే వాటికి సంబంధించిన ఐపీఓలు ఇష్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం రోజుల్లో దశలవారీగా అవన్నీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ వారం మొత్తం కొత్త ఐపీఓలతో మార్కెట్ కళకళలాడటం ఖాయం.

నాలుగు కంపెనీలు..
ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయడానికి సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) నాలుగు టాప్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఐపీఓలను జారీ చేయడానికి ప్రాతిపదికగా చెప్పుకొనే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)పై సెబి తన ఆమోదాన్ని తెలిపింది. వాటిన్నింటిపైనా ఆమోదముద్ర వేసింది. సెబి ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ నాలుగు కంపెనీలు కూడా ఇక ఐపీఓలను జారీ చేయడం లాంఛనప్రాయమే అవుతుంది.

లిస్ట్‌లో ఉన్న కంపెనీలివే..
మొత్తం నాలుగు కంపెనీలకు చెందిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లను సెబి అనుమతి ఇచ్చింది. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా ఇందులో ఉంది. అదాని విల్మార్ ఐపీఓకు సెబి అనుమతి లభించింది. దీనితో పాటు- స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, పెన్నా సిమెంట్స్, నైకా కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలను జారీ చేయడానికి సెబి అనుమతిని పొందాయి. దీపావళి కంటే ముందే ఈ నాలుగు కంపెనీలు కూడా ఐపీఓలను జారీ చేసే అవకాశం ఉంది.

4,500 కోట్ల కోసం..
అదాని విల్మార్ కంపెనీ.. 4,500 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి మొబిలైజ్ చేయడానికి పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. టాప్ సెల్లింగ్ వంటనూనె బ్రాండ్ ఫార్చూన్‌ను ఉత్పత్తి చేస్తోంది ఈ కంపెనీయే. అదాని ఎంటర్‌ప్రైజెస్, ఆసియన్ అగ్రి బిజినెస్ విల్మార్ ఇంటర్నేషనల్‌తో జాయింట్ వెంచర్‌గా ఏర్పడిందీ కంపెనీ. 2007 నాటికి దేశంలో లార్జెస్ట్ ఫుడ్ కంపెనీగా ఆవిర్భవించాలనేది అదాని విల్మార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పబ్లిక్ ఇష్యూకి వచ్చిన అనంతరం- అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి లిస్టెడ్ అయిన ఏడో కంపెనీగా గుర్తింపు పొందుతుంది.

రూ.5,500 కోట్ల సేకరణ కోసం
ప్రైవేట్ ఆరోగ్య బీమా సెగ్మెంట్‌లో అతి పెద్ద కంపెనీగా గుర్తింపు పొందింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఆరోగ్య బీమా సెక్టార్‌లో దీని మార్కెట్ షేర్ 15.8 శాతంగా ఉంటోంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 5,500 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కొత్తగా 2,000 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సేకరించడంతో పాటు 6,01,04,677 ఈక్విటీలను ప్రమోటర్లు, షేర్ హోల్డర్లకు విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే 3,06,83,553 ఈక్విటీ షేర్లను విక్రయించింది.

రూ.1,550 కోట్ల పెన్నా సిమెంట్
దక్షిణాదిన అతి పెద్ద సిమెంట్ తయారీ కంపెనీల్లో ఒకటైన పెన్నా సిమెంట్ కూడా పబ్లిక్ ఆఫరింగ్‌కు రానుంది. 1,550 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా 1,300 కోట్ల రూపాయల కోసం ఐపీఓను జారీ చేయడం, ప్రమోటర్స్ పీఆర్ సిమెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో 2,500 కోట్ల రూపాయలను సమీకరించాల్సి ఉందని సెబికి తెలిపింది. కృష్ణపట్నం లైన్-2 ప్రాజెక్ట్ కోసం 150 కోట్ల రూపాయలు, తలారిచెరువు వద్ద ఉన్న ప్లాంట్ విస్తరణ కోసం మరో 190 కోట్ల రూపాయలు, తాండూర్ ప్లాంట్ వద్ద వేస్ట్ హీట్ రికవరీ యూనిట్ నిర్మాణం కోసం 110 కోట్ల రూపాయలను వ్యయం చేయాల్సి ఉందని, దీన్ని సమీకరించడానికి ఐపీఓను జారీ చేస్తామని సెబికి అందజేసిన ప్రతిపాదనల్లో తెలిపింది.

నైకా ఐపీఓ..
కాస్మటిక్స్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ సెగ్మెంట్‌లో ఉన్న నైకా కంపెనీ కూడా ఐపీఓను జారీ చేయనుంది. మొత్తంగా 4,000 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించాలని ప్రతిపాదించింది. కొత్తగా పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 525 కోట్ల రూపాయలు, 43.1 మిలియన్ల సెకెండరీ షేర్లను విక్రయించడం ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరిస్తామని నైకా తెలిపింది. ఈ మేరకు ఈ నాలుగు కంపెనీలు కూడా సెబి వద్దకు తమ ప్రతిపాదనలను పంపించాయి. వాటికి ఆమోదం లభించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications