అదానీ విల్మర్ స్టాక్స్ అదరగొడుతున్నాయి. 2022 క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన మల్టీ బ్యాగర్‌గా అదానీ స్టాక్స్ నిలిచాయి. అదానీ గ్రూప్ 2022 క్యాలెండర్ ఏడాదిలో అంటే జనవరి 1వ తేదీ నుండి ఇప్పటి వరకు 125 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ఇప్పటికి కూడా ఈ స్టాక్ అప్ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ఇటీవల వరుసగా ఐదో రోజు భారీ లాభాల్లో ఉంది. నేడు (బుధవారం, ఏప్రిల్ 6) ఉదయం సెషన్‌లో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అదానీ విల్మర్ స్టాక్ ధర నేడు రూ.596.40 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నేడు 609ని తాకింది. ఇదే 52 వారాల గరిష్టం కూడా.

అదానీకి కొత్త అవకాశాలు
అదానీ విల్మర్ స్టాక్ ధర నేడు 15 శాతం లాభపడి రూ.596 వద్ద ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత అంతకంతకూ ఎగిసి మధ్యాహ్నం గం.12.26 సమయానికి 5 శాతం మేర లేదా రూ.29 మేర లాభపడి రూ.608.90 వద్ద ట్రేడ్ అయింది. ఈ స్టాక్‌కు ఇదే ఆల్ టైమ్ గరిష్టం. కమోడిటీ ధరలు పెరుగుతుండటం వల్ల, ముఖ్యంగా పామాయిల్ ధరలు పెరగడం కలిసి వస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే, అంతర్జాతీయ సరిహద్దు ఉద్రిక్తతలు, శ్రీలంక సంక్షోభం కొన్ని రంగాల స్టాక్స్ దూకుడుకు కారణమవుతోందని చెబుతున్నారు. శ్రీలంక సంక్షోభం ద్వారా కొత్త బిజినెస్ అవకాశాలు అందిపుచ్చుకున్నట్లుగా చెబుతున్నారు.

మరింత దూకుడు
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలంలో ఈ స్టాక్ దూకుడు కొనసాగవచ్చునని, అదానీ విల్మర్ షేర్ ధర మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలంలోను మంచి లాభాలు ఉంటాయి. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలపై భారీ ప్రభావం కనిపించింది. దీనిని అదానీ విల్మర్ లిమిటెడ్ సాధ్యమైనంత మేర ఈ గ్యాప్‌ను ఫిల్-అప్ చేసి, అవకాశాన్ని అందిపుచ్చుకుందని చెబుతున్నారు. ఇప్పుడు శ్రీలంక సంక్షోభం కూడా అదానీకి కలిసి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్స్‌ను పంపిస్తూ సాయమందిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకలో అదానీ విల్మర్‌కు మంచి వ్యాపార అవకాశంగా ఉంటుందని చెబుతున్నారు.

126 శాతం జంప్
అదానీ విల్మర్ స్టాక్ 2022 క్యాలెండర్ ఏడాదిలో 126 శాతం లాభపడింది. అంటే ఈ కాలంలో రూ.268 వద్ద ఉన్న స్టాక్ రూ.340 పెరిగి రూ.609కి చేరుకుంది. ఇక అదానీ పవర్ అయితే అత్యధికంగా 92 శాతం లాభపడింది. అదానీ టోటల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు వరుసగా 35 శాతం, 33 శాతం లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ షేర్లు 22 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 15 శాతం, అదానీ ట్రాన్సుమిషన్ 7 శాతం ర్యాలీ చేసింది. అదానీ ట్రాన్సుమిషన్, అదానీ పోర్ట్స్ మినహా అదానీ గ్రూప్‌లోని మిగిలిన ఐదు కంపెనీల షేర్లు లైఫ్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. గత నెలలో సెన్సెక్స్ మాత్రం 11 శాతం లాభపడింది. అంటే సెన్సెక్స్ కంటే అదానీ గ్రూప్ స్టాక్స్ అధికంగా ర్యాలీ చేశాయి. దీంతో అదానీ సంపద జనవరి నుండి మార్చి మధ్య కాలంలో 21.1 బిలియన్ డాలర్లు లేదా రూ.1.60 లక్షల మేర సంపదను జత చేసుకున్నారు. అదే సమయంలో ముఖేష్ అంబానీ రూ.8.24 బిలియన్ డాలర్లు లేదా రూ.62,000 కోట్లు మాత్రమే జత చేసుకున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications