Adani Wilmar: భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఏ రంగంలో అడుగుపెట్టినా దానిని లాభదాయకమైనదిగా మార్చేందుకు తీవ్రంగా కృషిచేస్తారని తెలిసిందే. ఇన్నాళ్లు పవర్, మౌలికసదుపాయాలు, ఓడరేవులపై ఉన్న ఆయన దృష్టి ఒక్కసారిగా ఎఫ్ఎంసీజీ వ్యాపారంపై పడింది. దీంతో అంబానీ, టాటాలకు ధీటుగా ఈ రంగంలో ఎదిగేందుకు కొత్త కంపెనీల కొనుగోలుకు గౌతమ్ అదానీ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం అదానీ గ్రూప్ తన ఎఫ్ఎంసీజీ వ్యాపార పాదముద్రను వేగంగా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ వ్యాపారంలో తనదైన ముద్ర వేయడానికి గౌతమ్ అదానీ గ్రూప్ దాదాపు 1 బిలియన్ డాలర్లను వెచ్చించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో బిలియనీర్ తన అదానీ విల్మార్ లిమిటెడ్ ద్వారా దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా కంపెనీ మసాలా దినుసులు, రెడీ-టు-కుక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ గూడ్స్ వ్యాపారాల్లో ప్రత్యేకత కలిగిన మూడు బ్రాండ్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని వార్తా నివేదికలు వస్తున్నాయి.

ప్రస్తుతం అదానీ విల్మార్.. ఫార్చ్యూన్ ఆయిల్, కోహినూర్ రైస్ వంటి ప్రసిద్ధ ఉత్పత్తులను కలిగిఉంది. అయితే కొన్ని నెలల కిందట అదానీ విల్మార్ తన కంపెనీలోని వాటాలను విక్రయించాలని చూసిన వార్త తెలిసిందే. అయితే ప్రస్తుత వ్యాపార విస్తరణను పరిశీలిస్తే మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఎంసీజీ రంగంలో పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని కంపెనీ వెనక్కి తిరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అదానీ విల్మార్ ఇటీవలి వార్షిక నివేదికలో దేశంలోనే అతిపెద్ద ఫుడ్ ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా అవతరించే లక్ష్యంతో ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారంలోకి విస్తరించే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు వ్యాపార వ్యూహాన్ని వెల్లడించింది.
ఈ చర్యతో రూ.6 లక్షల కోట్లు విలువైన భారతీయ ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్ పై అదానీ విల్మార్ తన ఫోకస్ పెట్టింది. గణనీయమైన వాటాను ఈ రంగంలో దక్కించుకునే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కంపెనీ దూకుడు విస్తరణ మధ్య కంపెనీ షేర్లు గత నవంబర్ నుంచి దాదాపు 27 శాతం లాభపడ్డాయి. క్యాష్ పొజిషన్ కూడా మెరుగుపడినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ చర్యలు కంపెనీపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింతగా బలపరుస్తోంది. నేడు ఇంట్రాడేలో మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో 3.22 శాతం లాభపడి రూ.373.65గా కొనసాగుతోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications