adani: భారతీయ వ్యాపార దక్షతను అంతర్జాతీయంగా ఎలుగెత్తి చాటిన గొప్ప బిజినెస్ మ్యాన్ గౌతమ్ అదానీ. తన వ్యాపార సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా ఎదిగారు. కానీ హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం పరిస్థితి పూర్తిగా తారుమారైంది. గ్రూపు కంపెనీలు ఇప్పటి వరకు మార్కెట్ విలువలో 132 బిలియన్ డాలర్లు కోల్పోయినట్లు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఆ సంస్థలను దాదాపు ప్రతిరోజూ నష్టాలే పలకరిస్తున్నాయి. సంపద మొత్తం హారతి కర్పూరంలా కళ్ల ముందే కరిగిపోతున్నా, ఏమీ చేయలేని దారుణ స్థితి దాపురించింది.

50 బిలియన్ డాలర్ల దిగువకు:
దాదాపు అదానీ గ్రూపు కంపెనీలన్నీ ఈరోజు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. గత 24 గంటల్లోనే 2.8 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైనట్లు ఫోర్బ్స్ సంస్థ పేర్కొంది. తద్వారా గౌతమ్ అదానీ సంపద 50 బిలియన్ డాలర్ల మార్కు దిగువకు తగ్గిపోయింది. 47.9 బిలియన్ డాలర్లతో ప్రస్తుతం ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ల జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారమూ ఆయన సంపద విలువ 49.1 బిలియన్ డాలర్లుగా ఉంది.

లోయర్ సర్క్యూట్ లే..
ఇవాళ మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ ఎంటర్ ప్రైజెస్ లో పతనం ప్రారంభమైంది. 6.37 శాతం(రూ.109) తగ్గి రూ.1,613 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అయితే సరైన వాల్యుయేషన్ ప్రకారం దాని విలువ రూ.946 ఉండాలని, కాబట్టి షేర్ ధర మరింత క్షీణించవచ్చని ప్రముఖ ఆర్థిక నిపుణులు, ప్రొఫెసర్ అశ్వత్ దామోదరన్ అభిప్రాయపడ్డారు. కాగా గత నవంబరులో కంపెనీ స్టాక్ ధర గరిష్టంగా రూ.4,190ని టచ్ చేసింది. అదానీ పవర్, ACC, అంబుజా సిమెంట్స్ మినహా గ్రూపులోని దాదాపు ఇతర కంపెనీలన్నీ ఈరోజు 5 శాతం లోయర్ సర్క్యూట్ ను అందుకున్నాయి.

ప్రపంచ దనవంతుల్లో రెండవ స్థానమూ..
ఒకానొక సమయంలో ఆసియాలో అత్యంత ధనవంతుడిగా, ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానాన్ని సైతం అదానీ సొంతం చేసుకున్నారు. 147 బిలియన్ డాలర్ల ఆస్తితో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తరువాత అత్యంత ధనవంతుడిగానూ గతంలో రికార్డు సృష్టించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సంపాదించేందుకు.. అదానీ గ్రూపు రుణాలు తిరిగి చెల్లించడంతో పాటు వరుస కాన్ఫరెన్స్ కాల్స్ నిర్వహిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications