Adani news: చరిత్ర సృష్టించిన అదానీ పోర్ట్.. భారత సముద్ర వాణిజ్యంలో కీలక ఘట్టం
Adani news: ఇండియాలోని వివిధ పోర్టులు, ఎయిర్ పోర్టులను నిర్వహించడంలో అదానీ గ్రూపుకు అపార అనుభవం ఉంది. దాని ఆధ్వర్యంలో నిన్న ఓ చారిత్రాత్మక ఈవెంట్ కు కేరళలోని విజింజం ఓడరేవు వేదికైంది. ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద ఓడల అన్ లోడింగ్, డాకింగ్ కు ఇండియాలో అనువైన ప్రదేశంగా రికార్డు సృష్టించింది.
అదానీ నిర్వహణలోని కొత్త మెగా పోర్ట్ ప్రపంచంలోని అతిపెద్ద నౌకను దేశానికి రప్పించింది. కేరళ తీరప్రాంతం వెంబడి ఉన్న విజింజం ఓడరేవును స్థానిక రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అదానీ పోర్ట్స్ మరియు SEZ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. కాగా తూర్పు చైనా సముద్రం నుంచి ప్రయాణించే భారీ లోడ్ కార్గో క్యారియర్ 'జెన్ హువా 15' ఆదివారం ఇక్కడ అన్ లోడ్ అయింది.

భారీ షిప్‌మెంట్ దించడం ఇక్కడ మొదటిసారి కాగా.. ఈ ఫీట్ తో ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ షిప్ ల నిర్వహణలో భారత్ భాగస్వామి అయింది. చైనా ఆధిపత్యం చెలాయించే అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో సింహ భాగాన్ని ఆక్రమించుకోవడానికి ఈ విజింజం ట్రాన్స్‌షిప్‌మెంట్ కంటైనర్ పోర్ట్ ఇండియాకు అవకాశం కల్పిస్తోంది. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం ద్వారా ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఉండాలనే భారత్ ఆశలను బలపరుస్తుంది.
గ్లోబల్ కార్గో ట్రాఫిక్‌లో 30 శాతంగా ఉన్న అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలకు సమీపంగా, సముద్రం దిగువన 24 మీటర్ల వరకు ఉన్న సహజ ఛానల్ విజింజమ్ ఓడరేవు. ఇప్పటి వరకు దేశీయ నౌకాశ్రయాల్లో తగినంత లోతు లేకపోవడంతో.. కంటైనర్ షిప్ లు అన్ లోడింగ్, డాకింగ్ కోసం భారత్ ను దాటి కొలంబో, దుబాయ్, సింగపూర్ వంటి పొరుగు ఓడరేవులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బందికి ఇక చెక్ పడినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications