Adani News: భారీ నిధుల సమీకరణకు అదానీ ట్రాన్స్‌మిషన్ గ్రీన్ సిగ్నల్..!
Adani News: మార్కెట్ నుంచి 85 బిలియన్ రూపాయలను సమీకరించే ప్రణాళికకు అదానీ ట్రాన్స్‌మిషన్ శనివారం ఆమోదం తెలిపింది. హిండెన్ బర్గ్ వివాదం జరిగిన నెలల తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల్లో ఒకదాని నుంచి ఫండ్ రైజింగ్ ప్లాన్ వెలువడటం ఇది మెుదటిది.
హిండెన్‌బర్గ్ ఆరోపణలతో పాటు సుప్రీం కోర్టు ఆదేశానుసారం అదానీ గ్రూప్ సంబంధిత పార్టీ వ్యవహారాలపై భారతదేశ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విచారణ జరుపుతున్నప్పటికీ అదానీ మాత్రం అన్ని ఆరోపణలను ఖండించారు. ఈక్విటీ షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ లేదా ఇతర అనుమతించదగిన మోడ్ ద్వారా విక్రయించడం ద్వారా నిధులను సేకరించాలని యోచిస్తున్నట్లు అదానీ ట్రాన్స్‌మిషన్ ప్రకటనలో తెలిపింది.

అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు సోమవారం నుంచి అదనపు నిఘా వ్యవస్థ (ASM) పరిధికి వెలుపల ట్రేడ్ అవుతాయని BSE, NSE తెలిపాయి. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు, మార్కెట్ సమగ్రతను పెంపొందించటానికి స్టాక్ ఎక్స్ఛేంజీలతో సంయుక్తంగా ASM ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది.
అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ MSCI ఇండియా ఇండెక్స్ నుంచి మే 31 నాటి నుంచి తొలగించబడుతోంది. MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ నుంచి అదానీ ట్రాన్స్‌మిషన్ నిష్క్రమించడం వల్ల 201 మిలియన్ డాలర్ల నష్టం రావచ్చు. అలాగే అదానీ టోటల్ గ్యాస్‌కు 186 మిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది. MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌ను గ్లోబల్ ఫండ్ హౌస్‌లు గ్లోబల్ ఈక్విటీల పోర్ట్‌ఫోలియోలను బెంచ్‌మార్కింగ్ చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తాయి.


Click it and Unblock the Notifications