Adani News: హిండెన్‌బర్గ్ ఉచ్చులో అదానీ కంపెనీ.. వామ్మో.. చెప్పినట్లే జరిగిందిగా..!!
Adani Total Gas: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఈఏడాది జనవరిలో అదానీ గ్రూప్ కంపెనీలను టార్గెట్ చేసింది. అయితే ఆ ప్రభావం అదానీ కంపెనీపై ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకదాని వెనుక మరొక దర్యాప్తులు ప్రారంభం అవుతూనే ఉంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అదానీ గ్రూప్ లోని అదానీ టోటల్ కంపెనీ విలువ గురించే. అవును అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ అంచనాలకు ప్రస్తుతం కంపెనీ విలువ సరిపోయింది. అవును అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ టోటల్ స్టాక్ ధర దాదాపు 85 శాతం క్షీణించింది. తొమ్మిది నెలల కాలంలో ఇంత భారీగా కంపెనీ వాల్యుయేషన్ పతనం తర్వాత విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. మెుత్తం 7 అదానీ లిస్టెడ్ కంపెనీలపై హెచ్చరికల తర్వాత మెుదటగా ఇది చోటుచేసుకుంది.

సోమవారం అదానీ గ్రూప్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ షేర్లు సోమవారం 2.6% పడిపోయి రూ.575.7ను చేరుకుంది. జనవరి 24న ఈ కంపెనీ ముగింపు షేర్ ధర రూ.3,891.75గా ఉంది. అంటే ప్రస్తుత లెక్కన స్టాక్ ధర దాదాపు 85 శాతం క్షీణించింది. ఆరోపణలతో కుప్పకూలిన అదానీ బాండ్స్ పుంజుకోగా.. పోర్ట్స్-టు-పవర్ గ్రూప్ GQG పార్టనర్స్ నుంచి భారీగా పెట్టుబడుల రూపంలో నిధులను పొందటంతో వ్యవహారం కొంత కుదుటపడింది. అయితే ఈ క్రమంలో అదానీ టోటల్ గ్యాస్ కంపెనీ షేర్లు మాత్రం అత్యంత దారుణంగా ప్రభావితం అయ్యాయి.
2030 నాటికి దేశంలోని అన్ని వాణిజ్య కార్లను ఈవీలుగా మార్చాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయిచటం కంపెనీకి కొత్త సవాలుగా మారింది. నగరంలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాణిజ్య వాహనాలను లక్ష్యంగా చేసుకునే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ 2.0 చివరిదని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ శుక్రవారం తెలిపారు.


Click it and Unblock the Notifications