Adani Total: క్యూ3వో కుమ్మేసిన అదానీ టోటల్ గ్యాస్.. కీ హైలైట్స్ ఇవే..!!
Q3 Results: అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో ఒకటైన అదానీ టోటల్ గ్యాస్ తాజాగా తన డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించింది. హిండెన్ బర్గ్ దాడి తర్వాత కంపెనీ ఊహించని రీతిలో పుంజుకుని మంచి ఫలితాలను ప్రకటించింది.
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ డిసెంబర్ త్రైమాసికంలో రూ.177 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.150 కోట్ల కంటే 18 శాతం అధికం. అలాగే మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 4.89 శాతం పెరిగి రూ.1,244 కోట్లుగా నమోదైంది. ఈ త్రైమాసికంలో EBIDTA రూ.300 కోట్లకు చేరుకుంది.

దేశంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగంగా ట్రాక్ చేయడం ద్వారా PNG, CNG రూపంలో సహజ వాయువును సులభంగా యాక్సెస్ చేయడం అదానీ టోటల్ గ్యాస్ ప్రస్తుత ప్రాధాన్యత కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. అదానీ టోటల్ ఎనర్జీస్ ఈ-మొబిలిటీ లిమిటెడ్ దేశంలోని 10 రాష్ట్రాల్లోని 46 నగరాల్లో 329 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించింది. దీనికి తోడు అదనంగా వివిధ ప్రాంతాల్లో 1050 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లు నిర్మాణంలో ఉన్నట్లు వెల్లడైంది. రానున్న కాలంలో వీటిని దేశంలోని 20 రాష్ట్రాల్లోని 130 నగరాలకు విస్తరిస్తామని కంపెనీ చెబుతోంది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన 500 TPD మునిసిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాజెక్ట్‌పై సన్నాహక పని ఇప్పటికే ప్రారంభమైంది. కంపెనీ తన తొలి ఎల్‌ఎన్‌జీ రిటైల్ అవుట్‌లెట్‌ను నిర్మించడం ద్వారా రవాణా ఇంధనంగా ఎల్‌ఎన్‌జీ విభాగంలో అవకాశాలను ప్రారంభించింది. గుజరాత్‌లోని దహేజ్‌లో జూలై 2024 నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. పాన్ ఇండియా అంతటా వివిధ వ్యూహాత్మక ప్రదేశాలలో ఎల్‌ఎన్‌జీ స్టేషన్ నెట్‌వర్క్‌ను సెటప్ చేయడానికి ప్రణాళికను కంపెనీ సిద్ధం చేసింది.


Click it and Unblock the Notifications