Adani News: గ్రీన్ హైడ్రోజన్ రంగంలో అదానీ మరో అడుగు.. ప్రాజెక్ట్ ఎక్కడంటే..??
Adani News: గత కొన్ని నెలలుగా అదానీ దూకుడు కొంత తగ్గించారు. అయితే కీలక వ్యాపారాల్లో ఆచితూచి తన అడుగులను ముందుకు వేస్తున్నారు. దీనికి తోడు సుప్రీం కోర్టు నుంచి వచ్చిన ఊరటతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు తీస్తున్నాయి.
ఈ క్రమంలో అదానీ టోటల్ గ్యాస్ గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ పైలట్‌ను అహ్మదాబాద్‌లో ప్రారంభించినట్లు వెల్లడించింది. కంపెనీ 4000 నివాస, వాణిజ్య వినియోగదారుల కోసం గ్రీన్ హైడ్రోజన్‌ను సహజ వాయువుతో మిక్స్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ Q1FY24-25 నాటికి ప్రారంభించబడుతుందని అంచనా. రెగ్యులేటరీ అనుమతులపై ఆధారపడి గ్రీన్ హైడ్రోజన్ శాతం క్రమంగా 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వరకు పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది.

పైలట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, హైడ్రోజన్ మిశ్రమ ఇంధనం నగరంలోని పెద్ద ప్రాంతాలకు, అదానీ టోటల్ యెుక్క ఇతర లైసెన్స్ ప్రాంతాలకు సరఫరా చేయబడుతుందని కంపెనీ వెల్లడించింది. నీటి ఎలక్ట్రాలసిస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో నీటి ద్వారా విద్యుత్ పంపినప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించబడుతుంది. ఈ ప్రక్రియలో వినియోగించే విద్యుత్తును పునరుత్పాదక శక్తి ద్వారా తయారు చేయబడుతుందని తెలుస్తోంది.
హైడ్రోజన్‌ను గ్యాస్‌తో కలపడం వల్ల మండే గ్యాస్‌లో దాని వేడి సామర్థ్యాలను కోల్పోకుండా కార్బన ఉద్గారాలు తగ్గుతాయని తెలుస్తోంది. 8 శాతం హైడ్రోజన్ మిశ్రమం కార్బన్ ఉద్గారాలను 4 శాతం తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయని అదానీ టోటల్ గ్యాస్ వెల్లడించింది. నేడు ఇంట్రాడేలో అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ మెగా ర్యాలీలో ముందుంది. ఎన్ఎస్ఈలో స్టాక్ ధర 20 శాతం పెరిగి రూ.644.15 వద్ద అప్పర్ సర్క్యూలో లాక్ అయ్యింది. వాస్తవానికి జనవరి చివరిలో హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత ఈ ఏడాది స్టాక్ ధర ఏకంగా 81.85 శాతం నష్టపోయింది.


Click it and Unblock the Notifications