Adani News: గూగుల్, రిలయన్స్‌కు పోటీగా రంగంలోకి అదానీ గ్రూప్.. ఆ విభాగంలో ఎంట్రీకి ప్లాన్
Digital services: దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న ప్రముఖ కంపెనీల్లో అదానీ గ్రూప్ ఒకటి. సంవత్సరం క్రితం హిండెన్‌బెర్గ్ నివేదిక వల్ల లక్షల కోట్ల మేర భారీ నష్టాలను మూటగట్టుకోగా.. ఏడాది తిరిగే సరికి పోగొట్టుకున్న దాన్ని వడ్డీతో సహా వసూలు చేసి చూపించింది. తాజాగా మరోకొత్త విభాగంలోకి ఎంటర్ అయ్యేందుకు ఛైర్మన్ గౌతమ్ అదానీ పావులు కదుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ మరియు ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పోటీపడాలని అదానీ గ్రూప్ భావిస్తోంది. ఈ మేరకు డిజిటల్ కంపెనీని అభివృద్ధి చేయాని ప్లాన్ చేస్తోంది. ఇ-కామర్స్ మరియు చెల్లింపుల రంగంలోకి ప్రవేశించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

భారత్‌లో విస్తృతంగా ఉపయోగిస్తున్న పబ్లిక్ డిజిటల్ చెల్లింపుల నెట్‌వర్క్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)పై ఆపరేట్ చేయడానికి లైసెన్స్ కోసం ప్రయత్నిస్తోంది. కో-బ్రాండెడ్ అదానీ క్రెడిట్ కార్డుల జారీ కోసం పలు బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్‌ను అనుభూతిని అందించడానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో ONDC మరియు UPI విభాగాల మద్ధతు ఉండనుంది.
అదే జరిగితే హోటల్ మరియు విమాన రిజర్వేషన్‌లతో సహా ప్రయాణ సంబంధిత సేవలను అందించే అదానీ వన్ వినియోగదారులు సదరు యాప్ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ఇ-కామర్స్ మరియు చెల్లింపుల ఆఫర్ల ద్వారా మొదట ప్రస్తుత ఖాతాదారులను అదానీ గ్రూప్ లక్ష్యంగా చేసుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది NDTV కంటెంట్‌ని కూడా ఆ యాప్‌లో జోడించాలని అదానీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications