Adani News: ప్రజలతో ఎంతగానో మమేకమైన పేటీఎం క్రమక్రమంగా కనుమరుగవుతోంది. ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ఫోన్ పే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే తమ లోపాలను సరిచేసుకుని తిరిగి మార్కెట్లో నిలబడతామని పేటీఎం వ్యవస్థాపకులు పదేపదే చెబుతున్నారు. కాగా దాన్ని నిజం చేయడానికి ఏకంగా గౌతమ్ అదానీ రంగంలోకి దిగారు.
రిజర్వ్ బ్యాంక్ దెబ్బతో తీవ్ర నష్టాల పాలైన పేటీఎం.. అదానీ గ్రూప్ నుంచి గుడ్‌న్యూస్ విననుందని వార్తలు వెలువడుతున్నాయి. పేటీఎం వ్యాపారాల్లో వాటా సొంతం చేసుకోవాలని గౌతమ్ అదానీ భావిస్తున్నట్లు సమాచారం. కంపెనీ మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఫౌండర్ మరియు CEO విజయ్ శేఖర్ శర్మతోనూ ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పేమెంట్స్ మార్కెట్‌లో ఫోన్ పే, గూగుల్ పేలు లీడర్‌గా కొనసాగుతున్నాయి. కాగా వీటికి గట్టి పోటీఇచ్చే ఉద్దేశ్యంతో అదానీ గ్రూప్ రంగంలోకి దిగుతున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి. ఈ డీల్ వల్ల ఒకరకంగా పేటీఎం ఎక్కువగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఇది పూర్తయిన తర్వాత మరో సంస్థ వెస్ట్ ఏషియాతోనూ పెట్టుబడులు పెట్టించాలని వన్ 97 లక్ష్యంగా పెట్టుకుంది.
ఇటీవల ముఖేష్ అంబానీ పలు కొత్త విభాగాలు, రంగాల్లో పెట్టుబుడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే క్రమంలో గౌతమ్ అదానీ కూడా వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఇరువురి మధ్య రసవత్తరమైన పోటీ ఖాయంగానే కనిపిస్తోంది. నువ్వానేనా అంటూ సాగే ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి మరి..
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications