Adani Group: దేశంలో ముఖ్యమైన వ్యాపార దిగ్గజాల్లో అదానీ గ్రూప్ ఒకటి. కంపెనీ వేగంగా ఇన్ ఫ్రా, డేటా సెంటర్లు, పవర్, గ్రీన్ ఎనర్జీ వంటి అనేక రంగాల్లో ఇప్పటికే వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులతో ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో అదానీ పోర్ట్స్ సీఈవో గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఎరో స్పేస్ సీఈవో ఆశీష్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో చర్చించారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఇక్కర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ తనయులు వెల్లడించారు.

పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ వారికి భరోసా ఇచ్చారు. ప్రపంచ దేశాలకు వ్యాపార డెస్టినేషన్‌గా మారిన తెలంగాణలో కొత్త పెట్టుబడులకు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రతిపాదనపై అదానీ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ మరోమారు ఇక్కడ తమ పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు సానుకూలతన వ్యక్తం చేశారు.
అలాగే గ్రూప్ ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు సీఎం సమావేశంలో ప్రకటించారు. ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు వరుసలో నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. సమావేశంలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications